పెళ్లి పేరుతో లక్షలకు టోకరా.. నమ్మితే ఇతనిలా మోసపోతారు

తమ అవసరాల కోసం ఆశగా చూస్తూ ఉన్నవారిని.. ఆసరాగా తీసుకుని మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే పెళ్ళి పేరుతో లక్షలు కాజేసి.. ఓ వ్యక్తిని మోసం చేశారు పెళ్లిళ్ల బ్రోకర్లు. పూర్తి వివరాలు చూసేద్దాం.

తమ అవసరాల కోసం ఆశగా చూస్తూ ఉన్నవారిని.. ఆసరాగా తీసుకుని మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే పెళ్ళి పేరుతో లక్షలు కాజేసి.. ఓ వ్యక్తిని మోసం చేశారు పెళ్లిళ్ల బ్రోకర్లు. పూర్తి వివరాలు చూసేద్దాం.

పట్టణం, పల్లెటూరు అని తేడా లేకుండా… తమ అవసరాల కోసం ఆశగా చూస్తున్న వారిని నమ్మించి, బురిడీ కొట్టించే వారు పెరిగిపోయారు. ఉద్యోగం ఇస్తాను అని డబ్బులు కాజేసి మోసం చేసేవారిని చూసి ఉంటారు. ఇలా బయట రకరకాల వ్యాపారాల పేరుతో.. నిత్యం ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు వీటి పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఈ వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మోసపోయిన వ్యక్తి కథ వింటే మాత్రం నోటి మీద వేలు వేసుకుంటారు. ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా అని ఆశ్చర్య పోక తప్పదు. ముఖ్యంగా ఇది పెళ్లి కానీ ప్రసాదులకు హెచ్చరిక లాంటిదని చెప్పి తీరాలి. హిందూ పురంలోని ఓ వ్యక్తి దగ్గర.. లక్షలు కాజేసి.. పెళ్లి చేసి మరీ బురిడీ కొట్టించారు పెళ్లిళ్ల బ్రోకర్లు. అసలేమైందో చూసేద్దాం.

హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలోని వేమారెడ్డికి.. 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీనితో అతను పెళ్లిళ్ల బ్రోకర్లపై పూర్తిగా డిపెండ్ అయ్యాడు. అటు తన పెళ్లి చూడాలన్న తన తల్లిదండ్రులు కోరిక తీర్చేందుకు చివరికి ఊరు కానీ ఊరు కూడా వెళ్ళాడు ఆ వ్యక్తి. ఏళ్ళు మీద పడిన పెళ్లి కావడం లేదనే బెంగతో.. సంబంధం ఎక్కడ నుంచి వచ్చిందో.. ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా తెలియకుండా పెళ్ళికి ఓకే చెప్పేశాడు. భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్ కు చెందిన నీలపు బాల అనే మహిళతో సంబంధం కుదిర్చారు పెళ్లిళ్ల బ్రోకర్లు. అయితే అతనికి వయస్సు ఎక్కువగా ఉండడంతో.. ఎదురు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి దండ్రుల బాధ చూడలేక వేమారెడ్డి కూడా అందుకు సిద్ధపడ్డాడు. అలా పెళ్లి చూపులకు వెళ్లిన అతని దగ్గర అప్పటికప్పుడు రూ.4 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బు అందిన వెంటనే ఆగమేఘాల మీద అక్కడే ఓ గుడిలో.. హడావిడిగా పెళ్లి చేశారు. ఇక ఆ తర్వాత వేమారెడ్డి ఆ మహిళను తీసుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు.  అసలు కథ అక్కడ మొదలైంది.

పెళ్లి అయ్యి ఇంటికి వచ్చిన కొత్త కోడలు.. ఆ మాటలు ఈ మాటలు చెప్తూ వారం రోజులు కాలం వెళ్లబుచ్చింది. ఓ వారం తర్వాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదని.. ఉన్నపలంగా భీమవరం వెళ్లాలని పట్టు పట్టింది. కానీ పెళ్ళికి ముందు మాత్రం తనకు ఎవరు లేరని వాపోయిందట ఆ మహిళ. దీనితో వేమారెడ్డికి అనుమానం వచ్చి నిలదీయగా.. పంపించకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. సరే నీతో నేను వస్తాను అని ఆమెను తీసుకుని భీమవరం బయల్దేరాడు వేమారెడ్డి. తీరా స్టేషన్ కు వెళ్లిన తర్వాత మరో కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. నాతో రావొద్దు అని గోల చేసి అతని నుంచి పారిపోయింది. అలా రోజులు గడుస్తున్నా కొద్దీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం.. చివరికి పెళ్లిళ్ల బ్రోకర్ల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో.. వేమారెడ్డికి అనుమానాలు పెరిగిపోయాయి. దీనితో అతను భీమవరం వెళ్లి ఆరా తీయగా అసలు గుట్టు బయటపడింది. తనకు జరిగింది ఉత్తిత్తి పెళ్ళని.. తానూ మోసపోయానని తెలుసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆ బాధితుడు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. పెళ్లి కానీ ప్రసాదులు గా ఉన్నా పర్లేదు. కానీ ఇలా పెళ్లిళ్ల బ్రోకర్ల ఉచ్చులో పడుద్దంటూ వాపోయాడు వేమారెడ్డి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments