iDreamPost
android-app
ios-app

ఓ ప్రాణాన్ని కాపాడిన బాలుడు.. అతడి సాహసంపై ప్రశంసల వెల్లువ

ఓ బాలుడు వయసులో చిన్నవాడైనా పెద్ద సాహసం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఓ ప్రాణాన్ని కాపాడిన ఆ బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

ఓ బాలుడు వయసులో చిన్నవాడైనా పెద్ద సాహసం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఓ ప్రాణాన్ని కాపాడిన ఆ బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

ఓ ప్రాణాన్ని కాపాడిన బాలుడు.. అతడి సాహసంపై ప్రశంసల వెల్లువ

నేటి కాలంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఒక ప్రమాదాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అలా ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరైనా ఉండి ప్రాణాలు కాపాడితే వాళ్లని దేవుడిగా భావిస్తాం. అయితే ప్రస్తుత సమాజంలో మాత్రం మన కళ్లముందే ఎన్నో ప్రమాదాలు, దారుణాలు జరుగుతున్నా సహాయం చేయకుండా.. వాటిని ప్రేక్షకుల్లా చూస్తూ ఉంటారు. సాటివారిని కాపాడాలనే మానవత్వం మరచి మనకెందుకులే అని చేతులు దులుపుకున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఎదుటివారు ప్రాణాలతో విలవిలాడుతుంటే.. కాపాడాకుండా, సెల్ ఫోన్లో రికార్డు చేయ్యడమనేది అందరికి ట్రెండ్ గా మారింది. రోజురోజుకి మానవ సంబంధాలు దిగజారిపోతున్న తరుణంలో.. ఒక చిన్న బాలుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కొన్ని సమయాల్లో చాలామంది, ప్రమాదంకు గురియైన బాధితులకు సహాయం చేయకుండా.. చూసి చూడనట్టు వెళ్లిపోతుంటారు. కానీ, ఓ బాలుడు మాత్రం అలా చేయలేదు. పేరుకి వయస్సు చిన్నదైనా పెద్ద మనస్సుతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. కైకరం గ్రామానికి చెందిన చిన్నమ్ములు అనే మహిళ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరు కాలువలో పడిపోయింది. అయితే అక్కడే ఉన్న యశ్వంత్ అనే బాలుడు ఈ దృశ్యన్ని చూశాడు. వెంటేనే ఏమాత్రం అలస్యం చేయకుండా కాలువలోకి దూకి ఆమెను పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు.

కాగా, అక్కడే ఉన్న స్థానికులు హుటా హుటిన ఒడ్డు కొచ్చిన చిన్నమ్ములును బయటకు లాగారు. అయితే కాలువలో పడిన మహిళను ఆలస్యం చేయకుండా రక్షించడంతో ప్రాణాలతో బయట పడింది. కానీ, చిన్నమ్ములు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయం మాత్రం సందేహంగా మారింది. ఇది ఇలా ఉంటే.. ప్రమాదంలో ఉన్న మహిళను రక్షించడం కోసం.. యశ్వంత్ చేసిన ధైర్య సాహసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. యశ్వంత్ చేసిన గొప్ప పనికి స్థానిక ప్రజలతో పాటు, అధికారులు సైతం ప్రశంసలతో కొనియాడుతున్నారు.

ఇక యశ్వంత్ స్థానిక కైకరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్ కు ఈతలో మంచి ప్రావీణ్యం ఉండడంతో.. కాలువలో పడిపోయిన మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు. ఎదుటవారికి ఏమైతే నాకెందుకులే అని అనుకోకుండా.. గొప్ప మనస్సుతో ప్రమాదంలో ఉన్న వారిని తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి రక్షించాలనే ఆ బాలుడి ఆలోచనకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి, ఆ బాలుడు చేసిన ధైర్య సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి