iDreamPost
android-app
ios-app

సామాన్యుడిని ఘనంగా సత్కరించిన IAS..! ఎందుకంటే..!

సాయం చేసిన వారినే మోసం చేసే మనుషులు పెరిగిపోయారు. ఇక చేసిన సాయాన్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారని కొందరు అభిప్రాయా పడుతుంటారు. కానీ ఐఏఎస్ అధికారి ఒకరు ఓ సామాన్యుడిని తన ఇంటికి పిలిచి సత్కరించారు.

సాయం చేసిన వారినే మోసం చేసే మనుషులు పెరిగిపోయారు. ఇక చేసిన సాయాన్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారని కొందరు అభిప్రాయా పడుతుంటారు. కానీ ఐఏఎస్ అధికారి ఒకరు ఓ సామాన్యుడిని తన ఇంటికి పిలిచి సత్కరించారు.

సామాన్యుడిని ఘనంగా సత్కరించిన IAS..! ఎందుకంటే..!

నేటికాలంలో సాయం చేసిన వారినే మోసం చేసే మనుషులు పెరిగిపోయారు. ఇక చేసిన సాయాన్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారని కొందరు అభిప్రాయా పడుతుంటారు. కానీ తమకు ఎవరైనా సహయం చేస్తే..వారిని గుర్తు పెట్టుకుంటారు. అంతేకాక తమకు సాయం చేసిన రుణాన్ని తీర్చుకుంటారు. ఇది సామాన్యుల విషయంలోనే కాదు..గొప్ప గొప్ప అధికారులు కూడా పొందిన సాయంకి రుణం తీర్చుకుంటారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి సామాన్యుడిని ఘనంగా సత్కరించారు. మరి..కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రవీణ్ ప్రకాష్.. ఈపేరు ఏపీ అధికారులకు బాగా పరిచయం. మొన్నటి వరకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫేషీలో పని చేశారు. ఏపీ రాష్ట్రంలోనే సీనియర్ అధికారుల్లో ఆయన ఒకరు. ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో దిగి..తన కారులో సెక్యూరిటీ సిబ్బందితో కలిసి బెజవాడలోని తన ఇంటికి బయలు దేరారు. ఇదే సమయంలో ప్రధాని రాక ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆయన కారు ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. తన కారులోనే గంటపాటు వెయిట్ చేశారు.. ఎటూ కదిలే పరిస్థితి లేదు. ఇదే సమయంలో సరిగ్గా అటుగా ఓ సామాన్యుడు బైక్ పై వచ్చి.. సార్ కారు పక్కన ఆగాడు. ఆయనను వెంటనే గుర్తు పట్టి..సార్ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్నాడు. దీంతో లిఫ్ట్ ఇస్తాను సార్ అని ఆ కుర్రాడు ప్రవీణ్ ప్రకాశ్ తో అన్నారు. ఓకే చెప్పిన ఆ ఐఏఎస్ అధికారి ఆ కుర్రోడి బైక్ పై.. విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించిన తన ఇంటికి చేరుకున్నారు.

సాధారణంగా అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో భద్రతా సిబ్బంది ఉంటుంది. హాయిగా ట్రాఫిక్ ఆపి మరీ..తన ప్రయాణం సాగించవచ్చు. ఇవాళ ప్రధాని, ఇతర కేంద్ర మంత్రుల రాకతో  విజయవాడంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆయన స్వయంగా ట్రాఫిక్ కష్టాలు అనుభవించారు.  మొత్తంగా ఆ సామాన్యుడి సాయంతో 25 కిలోమీటర్లు బైక్ పై జర్ని చేసి ఇంటికి చేరారు. అయితే చాలా మంది అధికారులు తమకు సాయం చేసిన సామాన్యులను అలానే వదిలేస్తారు. కానీ ప్రవీణ్ ప్రకాశ్  మాత్రం తనకు సాయం చేసిన ఆ వ్యక్తి రుణం వెంటనే తీర్చుకున్నారు.

తన ఇంట్లో ఆ వ్యక్తి చిరు సత్కారం చేశారు.  తాము సమస్యలో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని మర్చిపోకూడదనే విషయం, సాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలనే గుణం ఈ తరం వారికి ఉండదు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని రుణం తీర్చుకుంటారు. అలాంటి వారిలో ఈ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఒకరు. ఆయన సామాన్యుడికి చేసిన సత్కారంకి  సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరిపై కూడా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నరు.