iDreamPost
android-app
ios-app

మత్స్యకారుల వలలో 1500 కిలోల చేప.. దీని ప్రత్యేకతలు తెలుసా?

  • Published Jul 29, 2024 | 11:25 AMUpdated Jul 29, 2024 | 11:25 AM

Machilipatnam: అప్పుడప్పుడు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నిరాశతో వస్తుంటారు.. కొన్నిసార్లు మాత్రం జాక్ పాట్ తగిలి అదృష్ట లక్ష్మిని వెంటబెట్టుకు వస్తుంటారు. మచిలీపట్నంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

Machilipatnam: అప్పుడప్పుడు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నిరాశతో వస్తుంటారు.. కొన్నిసార్లు మాత్రం జాక్ పాట్ తగిలి అదృష్ట లక్ష్మిని వెంటబెట్టుకు వస్తుంటారు. మచిలీపట్నంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

  • Published Jul 29, 2024 | 11:25 AMUpdated Jul 29, 2024 | 11:25 AM
మత్స్యకారుల వలలో 1500 కిలోల చేప.. దీని  ప్రత్యేకతలు తెలుసా?

సాధారణంగా మత్స్యాకారులు సముద్రంలో వేటకు వెళ్లినపుడు వింత వింత అనుబవాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి భారీ చేపలు పడతుంటాయి. కొన్నిసార్లు అరుదైన చేపలు వలలో చిక్కుకుంటాయి.. మార్కెట్‌లో వాటి విలువ లక్షల్లో ఉంటుంది. అలా కొంతమంది మత్స్యకారులు అదృష్టం కొద్ది జాక్ పాట్ కొట్టేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు తరుచూ చూస్తూనే ఉన్నాం. మీరు బాహుబలి చేపను ఎప్పుడైనా చూశారా? ఆ అద్భుతం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకారులకు ఓ చేప చిక్కింది.. దాని ఆకారం చూసి ఇది బాహుబలి చేప అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఓ భారీ చేప చెక్కింది. ఆ చేప బరువు ఏకంగా 1500 కిలోలు ఉండటంతో బాహుబలి చేప అంటున్నారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను అతి కష్టంగా బయటకు తీసుకువచ్చారు. దీన్ని మచ్చల సొర అని పిలుస్తారు. చెన్నైకి చెందిన ఓ బడా వ్యాపారి ఈ భారీ సొర చేపను కొనుగోలు చేశారు. ఈ తరహా సొర చేపలు తీరానికి రావడం చాలా అరుదు. అందుకే మార్కెట్ లో ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక్కొసారి వాటి ఆహారం కోసం ఇతర చేపలను వేటాడుతూ తీరానికి వస్తుంటాయి. అలాంటి సమయాల్లోనే మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి.

ఈ చేప అరుదుగా లభిస్తుంది.. అందుకే దీని విలువ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈ బాహుబలి చేప ఎంతకు అమ్ముడు పోయిందనే విషయం తెలియరాలేదు. ఈ చేపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఇదిలా ఈ టేకు చేపలు తినడానికి పనికిరావని మత్స్యకారులకు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీ కోసం ఉపయోగిస్తారని అంటున్నారు. ఇందులో ఎంతో ఔషద గుణాలు ఉన్నాయని.. అందుకే ఈ చేపకు ఇంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భారీ బాహుబలి చేపకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి