Tirupathi Rao
Summer Alert For Telugu People: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదలు కూడా కాకుండానే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
Summer Alert For Telugu People: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదలు కూడా కాకుండానే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
Tirupathi Rao
మండే ఎండాకాలం రానే వచ్చింది. మార్చి నెల కూడా ముగుస్తుండటంతో సూర్యుడు మరింత విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎండలకు అల్లాడిపోతున్నారు. నిజానికి ఏప్రిల్ మధ్యన రావాల్సిన వేసవి తాపం ఇప్పుడే కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మూడోవారం నుంచే భానుడి ప్రతాపం ప్రారంభం అయిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలుగు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు కీలక ప్రకటన జారీ చేసింది. వైద్యులు, నిపుణులు కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. అలాగే వడగాల్పులు కూడా ప్రారంభం అయ్యాయి. క్రమేపీ అవి పెరుగుతున్నాయి కూడా. మార్చి 28వ తారీఖు 31 మండలాల్లో వడగాలాలు వస్తే.. 30 నాటికి ఆ సంఖ్య 44 మండలాలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతానికి అయితే సివియర్ హీట్ వేవ్ ప్రారంభం కాలేదు. కానీ, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 20 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. ముద్దనూరులో తీవ్ర వడగాల్పులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అక్కడి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఒక్కో మండలంలో హీట్ వేవ్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో కూడా ఎండలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలు, మండలాల్లో 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు పలు ప్రాంతాలకు ఆరంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమంగా జిల్లాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. మార్చి 30, 31, ఏప్రిల్ 1, 2, 3 తేదీలకు సంబంధించిన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. 29వ తారీకు 8 జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఏప్రిల్ 3నాటికి ఆ సంఖ్య 17 జిల్లాలకు చేరుతోంది. అంటే ఈ వేసవి మరింత వేడిగా ఉండబోతోంది. అందుకే అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేయడం మాత్రమే కాకుండా.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఎండలు 40 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వేసవిని అలక్ష్యం చేయకండని అధికారులు సూచిస్తున్నారు.
అన్ని వేసవుల కంటే ఈసారి కాస్త వేడిగా ఉండే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి కాబట్టి.. అవసరం లేనిది ఎండలోకి రావద్దని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవాళ్లు, ఉద్యోగ రీత్యా బయట తిరిగేవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. లేత రంగు దుస్తులు ధరించడం, కళ్లద్దాలు పెట్టుకోవడం, తరచూ మంచినీళ్లు తాగడం, కాళ్లకు బూట్లు వేసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ తినడం, శరీరం డీహైడ్రోట్ కాకుండా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఈ కాలంలో వేపుడులు, కారాలు, పచ్చళ్లు తినడం తగ్గిస్తే మరింత మంచిదని సూచిస్తున్నారు. వాటివల్ల దావాద్రి పెరుగుతుందంటున్నారు. మరి.. అధికారులు ఇస్తున్న ఈ హెచ్చరికలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.