iDreamPost
android-app
ios-app

స్కూల్ వ్యాన్ బోల్తా ఏకంగా 25 మంది విద్యార్థులు!

  • Published Feb 20, 2024 | 2:01 PM Updated Updated Feb 20, 2024 | 2:42 PM

నిత్యం రోడ్ యాక్సిడెంట్స్ కు సంబంధించిన ఎన్నో వార్తలను చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా కడప జిల్లాలో జరిగిన స్కూల్ వ్యాన్ బోల్తా పడడం అనేది సంఘటన అందరిని మరోసారి కలచివేసింది.

నిత్యం రోడ్ యాక్సిడెంట్స్ కు సంబంధించిన ఎన్నో వార్తలను చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా కడప జిల్లాలో జరిగిన స్కూల్ వ్యాన్ బోల్తా పడడం అనేది సంఘటన అందరిని మరోసారి కలచివేసింది.

  • Published Feb 20, 2024 | 2:01 PMUpdated Feb 20, 2024 | 2:42 PM
స్కూల్ వ్యాన్  బోల్తా ఏకంగా 25 మంది విద్యార్థులు!

ఈరోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు.. ఇంట్లోని వారికి కంగారుగానే ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలను స్కూల్స్ కు పంపించే విషయంలో.. తల్లి తండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అందులోను స్కూల్ బస్సులలో పిల్లలను పంపించాలంటే.. తల్లి తండ్రులు చాలా భయపడుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో అర్థంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. స్కూల్ బస్సులు బోల్తాపడిందని.. అదుపుతప్పి యాక్సిడెంట్స్ కు గురి అయ్యాయని.. అడపాదడపా ఏవో ఒక వార్తలు అందరిని కలచి వేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో స్కూల్ బస్సు బోల్తా పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ సంఘటన కడప జిల్లా వల్లూరు మండలం అంబవరం గ్రామం దగ్గర జరిగింది. ఆ ప్రాంతంలోని భాష్యం విద్యాసంస్థలకు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ, అదృష్టవ శాత్తు ఎవరికీ అంతగా ఎక్కువ గాయాలు కాలేదు. కేవలం మాత్రమే ఆరుగురికి గాయాలు కావడంతో వారిని 108 వాహనాలలో కడప రిమ్స్‎కు తరలించారు.అయితే, కడప నుండి అంబవరం గ్రామానికి సింగల్ రోడ్డు మాత్రమే ఉండడంతో.. అది కూడా గతుకులుగా ఉన్న కారణంగా .. ఈ ప్రమాదం జరిగినట్టు తెలియజేశారు. స్కూలు అయిపోయిన తర్వాత విద్యార్థులను ఇంటికి తీసుకు వెళుతున్న క్రమంలో స్కూల్ వ్యాన్ పూర్తిగా ఒకవైపుకు ఒరిగింది. దీనితో అదుపు తప్పి బోల్తా పడింది. పక్కనే పంట కాలువలకు తీసిన చిన్న కాలువ ఉండటం.. అది కూడా ఎండిపోయి ఉండటంతో విద్యార్థులకు ఎటువంటి హాని జరుగలేదు.

అయితే, బస్సు బోల్తా పడిన సమయంలో .. 25 మంది విద్యార్థులు ఉండడంతో.. తీవ్ర నష్టం జరిగి ఉంటుందని అందరు భావించారు. కానీ, అదృష్టవ శాత్తు ఆ సమయంలో బస్సు స్లో గా పక్కకు ఒరగడం ..ఆ అందులోను డ్రైవర్ స్లో గా డ్రైవ్ చేయడంతో.. అందరు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఏదేమైనా స్కూల్ బస్సులను నడిపే డ్రైవర్లు.. నిత్యం అపప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఇటువంటి ప్రమాదాలకు గురి అవ్వకుండా చూసుకోవాల్సిన భాద్యత .. స్కూల్ యాజమాన్యానికి కూడా ఉంటుంది. కాబట్టి , స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్లు కాస్త జాగ్రత్తగా ఉండడం వలన.. విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మంచిది.