iDreamPost
android-app
ios-app

కంట్రోల్ రూమ్ లోకి చొరబడ్డ బిచ్చగాడు.. ఏం చేశాడంటే!

  • Published Oct 10, 2023 | 5:08 PM Updated Updated Oct 10, 2023 | 5:08 PM
  • Published Oct 10, 2023 | 5:08 PMUpdated Oct 10, 2023 | 5:08 PM
కంట్రోల్ రూమ్ లోకి చొరబడ్డ బిచ్చగాడు.. ఏం చేశాడంటే!

ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే బస్టాండులకు, రైల్వే స్టేషన్లకి అక్కడి నుంచి గమ్య స్థానాలకు వెళ్తుంటారు. అలా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యార్థం, వారికి వివిధ రకాల సేవలు అందిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో బస్ స్టేషన్లలో వింత ఘటనలు చోటు చోటుచేసుకుంటాయి. ఆర్టీసీ విచారణ కేంద్రంలోకి పిచ్చి వాళ్లు రావడం, గుర్తు తెలియని వ్యక్తులు రావడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా గన్నవరం బస్టాండ్ లో కూడా ఓ వింత ఘటన  చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ కంట్రోల్ రూమ్ లోకి ఓ బిచ్చగాడు చొరబడ్డాడు. అంతే కాదు కంట్రోలర్ కూర్చోవాల్సిన సీటులో ఆ  వ్యక్తి దర్జాగా కూర్చున్నాడు. అదే సమయంలో బస్సులకు సంబంధించిన సమాచారం అడిగేందుకు ప్రయాణికులు కంట్రోల్ రూమ్ కి వెళ్లారు. అక్కడ అధికారి సీట్లో బిచ్చగాడు కూర్చొని ఉండటాని చూసి ప్రయాణికులు ఖంగుతిన్నారు. బిచ్చగాడు ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే కూర్చున్నాడు. అయితే అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కంట్రోల్ రూమ్ లో బిచ్చగాడు కూర్చున్న ఆర్టీసీ అధికారులెవరూ పట్టించుకోలేదు. ఇదే  సమయంలో బస్సులకు సంబంధించి సమాచారం ఎవరిని అడగాలో తెలియక అనేక ఇబ్బందులు పడ్డారు. నిత్యం వివిధ ప్రాంతాలకు వేల మంది ఈ బస్టాండ్ మీదుగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఇలాంటి వింత ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio