iDreamPost

స్కూల్ బస్సు డ్రైవర్ తో బ్యాంక్ మేనేజర్ ప్రేమాయణం! ప్రియుడి కోసం ఏకంగా ..!

ఆమె పేరు పావని. చిన్నప్పటి చదువుల్లో బాగా రాణించడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కూతురికి వయసు రాగానే ఓ మంచి యువకుడితో వివాహం జరిపించారు. అలా కొంత కాలానికి తన తెలివితో పావని ఏకంగా ఓ బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగింది.

ఆమె పేరు పావని. చిన్నప్పటి చదువుల్లో బాగా రాణించడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కూతురికి వయసు రాగానే ఓ మంచి యువకుడితో వివాహం జరిపించారు. అలా కొంత కాలానికి తన తెలివితో పావని ఏకంగా ఓ బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగింది.

స్కూల్ బస్సు డ్రైవర్ తో బ్యాంక్ మేనేజర్ ప్రేమాయణం! ప్రియుడి కోసం ఏకంగా ..!

ఆమె పేరు పావని. చిన్నప్పటి చదువుల్లో బాగా రాణించడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కూతురికి వయసు రాగానే ఓ మంచి యువకుడితో వివాహం జరిపించారు. అలా కొంత కాలానికి తన తెలివితో పావని ఏకంగా ఓ బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. కొంత కాలానికి ఆమెకు పిల్లలు కూడా జన్మించారు. మంచి ఉద్యోగం, చేతినిండా డబ్బులు ఉండడంతో పావని సంసారం సంతోషంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే పావని స్కూల్ బస్సు డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఇక ఇక్కడి నుంచి సినిమా లెవల్ లో సాగిన వీరి లవ్ స్టోరీకి ఊహించని ట్విస్ట్ తో ఎండ్ కార్డ్ పడింది. ఇంతకు ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావనికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా కొన్ని రోజుల తర్వాత పావని ఓ బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం సాధించింది. గౌరవ ప్రదమైన ఉద్యోగం.., మంచి జీతం. ఇక అప్పటి వరకు వీరి సంసారం ఎలాంటి కష్టాలు, నష్టాలు లేకుండా సంతోషంగా సాగుతూ వచ్చింది. ఈ సమయంలోనే పావని భర్తతో గొడవ పడి వేరే కాపురం పెట్టింది. ఆ తర్వాత కంకిపాడు బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. అయితే ఈ క్రమంలోనే పావని తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది.

స్థానికంగా ఉండే ఓ స్కూలు బస్సు డ్రైవర్ తో ప్రేమాయణాన్ని కొనసాగించింది. అతడు కూడా ఆమెతో లవ్వాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది.. పావని  సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చేది. అలా చాలా కాలం పాటు భర్తకు అనుమానం రాకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంది. కానీ, కొన్నాళ్లకి పావని ప్రియుడితోనే ఉండాలని భావించింది. ఇందు కోసం పక్కా ప్లాన్ తోనే ప్రియుడితో లేచిపోవాలని నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగానే పావని ఇటీవల బ్యాంక్ లో ఖాతాదారులు కుదవబెట్టిన సుమారు రూ.6 కోట్ల విలువైన బంగారు అభరణాలు తీసుకుని ప్రియుడితో లేచిపోయింది.

చాలా రోజులు గడిచినా పావని బ్యాంకుకు రాకపోవడంతో అందరూ లీవ్ లో ఉందని అనుకున్నారు. కానీ, అనుమానం వచ్చి బ్యాంకులో ఉన్న బంగారు అరణాలను చూడగా అందులో అవి కనిపించలేదు. ఈ సీన్ చూసి బ్యాంక్ అధికారులు షాక్ గురయ్యారు. వెంటనే ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇది పావని పనే అని అనుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పావని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే బ్యాంకులో ఉన్న సీసీ కెెమెరాలను పరిశీలించగా.. పావని బ్యాగ్ తీసుకెళ్తున్నదృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడి కోసం ఏకంగా రూ.6 కోట్ల విలువైన బంగారు అభరణాలను కొట్టేసి పారిపోయిన బ్యాంక్ మేనేజర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి