ప్రైవేట్ ట్రావెల్స్ లో కొత్తరకం దొంగతనాలు! ధూమ్ మూవీ రేంజ్ ఇది!

Laptop Stolen In Bus: చాలా మంది యువత, ఉద్యోగులు వివిధ పనులు నిమిత్తం, బస్సు, రైళ్లల్లో జర్నీ చేస్తుంటారు. ఇక విధుల్లో భాగంగా తమ వెంట ల్యాప్ టాప్ లాంటి విలువైన వస్తువులను తీసుకెళ్తుంటారు. మీరు కూడా బస్సుల్లో విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే జాగ్రత్త..

Laptop Stolen In Bus: చాలా మంది యువత, ఉద్యోగులు వివిధ పనులు నిమిత్తం, బస్సు, రైళ్లల్లో జర్నీ చేస్తుంటారు. ఇక విధుల్లో భాగంగా తమ వెంట ల్యాప్ టాప్ లాంటి విలువైన వస్తువులను తీసుకెళ్తుంటారు. మీరు కూడా బస్సుల్లో విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే జాగ్రత్త..

మనం తరచూ ఏదో ఒక ప్రాంతానికి రైళ్లు, బస్సులో జర్నీ చేస్తుంటాము. ఇలా ప్రయణం చేసే సమయంలో కొన్ని సార్లు మన వెంట విలువైన వస్తువులను తీసుకెళ్తుంటాము. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు ప్రయాణికులకు సంబంధించిన విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. ప్రయాణికులను మాటల్లో పెట్టి, ఇతర మార్గాల్లో వారి వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా ఓ వెరైటీ దొంగతం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ల్యాప్ ట్యాప్ లను జర్నీ సమయంలో తమ వెంట వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. కేటుగాళ్లు కొత్తరకం పద్ధతితో ల్యాప్ ట్యాప్ లను  చోరీ చేస్తున్నారు.

చాలా మంది యువత, ఉద్యోగులు వివిధ పనులు నిమిత్తం, బస్సు, రైళ్లల్లో జర్నీ చేస్తుంటారు. ఇక విధుల్లో భాగంగా తమ వెంట ల్యాప్ ట్యాప్ లను తీసుకెళ్తుంటారు. అలానే విద్యార్థులు కూడా తమ సొంత గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ట్యాబ్స్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానికి పరికరాలను తీసుకెళ్తుంటారు. దూరం ప్రాంతాలకు జర్నీ అంటే.. ఎక్కువగా రాత్రివేళ చేస్తుంటారు.  ఈక్రమంలోనే  మన వద్ద ఉంటే విలువైన వస్తువులను కొందరు కేటుగాళ్లు చోరీ చేస్తుంటారు. కొందరు ప్రయాణికులు అయితే తమ వస్తువులపై కన్ను వేసి ఉంటారు. అందుకే తమ వస్తువులను తరచూ చెక్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే బ్యాగ్ లో ఉన్న వస్తువును పై నుంచే టచ్ చేసి..గట్టిగా ఉంటే.. తమ వస్తువు భద్రంగా ఉందనే భావనలో ఉంటారు. పొరపాటున కనిపించకుంటే వెంటనే అలెర్ట్ అయ్యి…దొంగతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతో కొందరు దొంగలు ప్రయాణికులను ఏమార్చి..కొత్తరకంగా ల్యాప్ టాప్ వంటి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. అదే సైజ్ లో ఉండే ఇతర డమ్మి వస్తువులను పెట్టి ప్రయాణికులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా విజయవాడ ప్రాంతంలో జరిగిన ఓ ఘటనే అందుకు ఉదాహరణ.

ఇటీవలే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో  ప్రయాణించాడు. రాత్రి సమయంలో అతడి బ్యాగ్ లోని ల్యాప్ టాప్ చోరీకి గురైంది. ఈ దొంగతనం కూడా చాలా వెరైటీగా చేశారు. ప్రయాణికులు నిద్రపోతున్న సమయంలో ల్యాప్ టాప్ సైజ్ లో ఉండే ఓ గాజు పలకను, అంతే వెయిట్ తో ప్రయాణికుడి బ్యాగ్ లో పెట్టారు. అందులోని ల్యాప్ టాప్ చోరీ చేశారు.  దూమ్ మూవీకి ఏమాత్రం తీసిపోని విధంగా కేటుగాళ్లు ల్యాప్ టాప్ ను చోరీ చేశారు. ముఖ్యంగా వారంతరపు సెలవుల్లో ఊర్లకు వెళ్లే విద్యార్థులను, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాబట్టి విలువైన వస్తువులతో ప్రయాణం చేసే వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న..మన విలువైన వస్తువులను కోల్పోవడం ఖాయమం.

Show comments