Arjun Suravaram
Arjun Suravaram
మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన మాటలు అందరికి తెలిసే ఉంటుంది. సాటి మనిషికి సేవ చేస్తే.. దేవుడికి చేసినట్లేనని దాని అర్థం. సాటి మనిషి సాయం అనేది ఏ రూపంలో అయిన కావచ్చు. అయితే నేటికాలంలో సాయం చేసే మనుషులు కరువయ్యారు. సాటి మనిషి ఇబ్బందులు పడుతున్నా చూస్తారే కానీ.. సాయం చేసేందుకు ముందుకు వెళ్లారు. ఇంకా దారుణం ఏమిటంటే.. చనిపోయిన వారికి తీసుకెళ్లేందుకు కూడా సాయం చేయరు. చాలా తక్కువ మంది మాత్రమే తోటి మనిషి సాయపడాలనే ఆశయంతో ఉన్నారు. అలాంటి వారు సామాన్య ప్రజల్లో, ప్రజా ప్రతినిధుల్లో, వ్యాపార వేత్తలో ఉంటారు. అరకు ఎంపీ దంపతులు మానవత్వం చాటుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఓ గిరిజనుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్.. మృతుడి కుటుంబానికి సాయంగా నిలిచారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల కొయ్యూరు మండలం ఎం. మాకవరం గ్రామానికి చెందిన సంబే సాయికుమార్ విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే కేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అరకు ఎంపీ మాధవి భర్తకు సమాచారం అందించారు. ఆమె సూచనల మేరకు భర్త కె. శివప్రసాద్ బాధితులను కలిసి అవసరమైన ఏర్పాట్లను చేశారు. అందులో భాగంగా సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ను సమకూర్చారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఎంపీ దంపతులు చూపిన ఔదార్యంపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురింపించారు. మరి.. ఎంపీ దంపతలు చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి