Dharani
ప్రయాణికులను ఆకర్షించడం కోసం రాష్ట్ర రవాణా సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉచిత బహుమతుల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలు..
ప్రయాణికులను ఆకర్షించడం కోసం రాష్ట్ర రవాణా సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉచిత బహుమతుల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలు..
Dharani
ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ.. ప్రయాణికులను ఆకర్షించడం కోసం రకరకాల పథకాలను ప్రవేశ పెడుతుంది. దీనిలో భాగంగా తాజాగా ఫ్రీ గిఫ్ట్ ఆఫర్‌ని ప్రకటించింది. దీని ప్రకారం బస్సులో ప్రయాణించే వారు ఉచిత బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ అధికారుల వెల్లడించారు. అయితే ఈ ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ అన్ని రూట్లకు వర్తించదని తెలిపారు. ఆమదాలవలస, బందరువానిపేట, చీపురుపల్లి, సాలూరు, శ్రీముఖలింగం, గుత్తావల్లి, యరగాం, విజయనగరం మార్గాల్లో మాత్రమే ఈ గిఫ్ట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు.
ఈ మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ ఉచిత బహుమతి పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రయాణికులు తాము తీసుకున్న టిక్కెట్ల వెనుక పేరు, మొబైల్ నంబరు రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిప్ట్ బాక్స్‌లో వేయాలని సూచించారు. ఇక స్కీమ్‌లో భాగంగా ప్రతి నెలా 3, 17 తేదీల్లో డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకాకుళం జిల్లాలోనే కాక.. పలు డిస్ట్రిక్ట్‌లలో ఇలానే ఫ్రీ గిఫ్ట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. డ్రాలో పేర్లు వచ్చిన వారికి బహుమతులు అందిస్తోంది.
ప్రయాణికులు ఎక్కువమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడం కోసమే ఈ ఫ్రీ గిఫ్ట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రతి నెలలో రెండు రోజులు లక్కీ డ్రా తీసి బహుమతులు అందిస్తున్నారు. ఈస్కీమ్‌ల పట్ల ప్రయాణికుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల రూట్లలో ఈ లక్కీ డ్రాను తీసుకొచ్చారు.
ఇక తెలంగాణలో కూడా సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అనేక వినూత్న రకాల కార్యక్రమాలు చేపట్టి.. ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక రోజుల్లో కొన్ని వర్గాల వారికి ఉచిత ప్రయాణం, వయసు పైబడిన వారికి టికెట్ ధరల్లో రాయితీలు వంటి ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే.