iDreamPost

తక్కువ రేటుకే ప్రత్యేక బస్సులు.. ఓటర్లకు APSRTC గుడ్ న్యూస్

మే 13న ఎన్నికల వేళ సొంత ఊర్లకు ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ దీన్ని అదునుగా చేసుకుని రేట్లు పెంచేసి సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

మే 13న ఎన్నికల వేళ సొంత ఊర్లకు ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ దీన్ని అదునుగా చేసుకుని రేట్లు పెంచేసి సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

తక్కువ రేటుకే ప్రత్యేక బస్సులు..  ఓటర్లకు APSRTC గుడ్ న్యూస్

మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఓటర్లు సొంత ఊర్లకు బయలుదేరారు. ఇంకొంతమంది శని, ఆదివారాల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ వారు దందా కారణంగా సామాన్యులకు ఈ ధరలు గుదిబండగా మారాయి. 500 రూపాయలు ఉన్న టికెట్ ధరలు 2,500, 3 వేలు, 5 వేలు పెట్టి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.

ఇప్పటికే మే 8 నుంచి 12 వరకూ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా కొన్ని బస్సులు నడుస్తున్నాయి. వీటితో పాటు అదనంగా సర్వీసులను పెంచినట్లు ఏపీఎస్ ఆర్టీసీ పేర్కొంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ 339 బస్సులు నడుస్తుండగా.. అదనంగా మే 11న 302 బస్సులను ఏర్పాటు చేశారు. మే 12న అదనంగా 206 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ కి 4 బస్సులు, విజయవాడకు 45 బస్సులు, ఒంగోలుకు 38, ఏలూరుకి 20, మచిలీపట్నానికి 23 బస్సులు, గుంటూరుకు 18 బస్సులు, నరసరావుపేటకు 26 బస్సులు, నెల్లూరుకు 17, నంధ్యాలకు 19 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది.

అలానే హైదరాబాద్-బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి కూడా ఏపీకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఓటర్లతో విజయవాడ బస్ స్టేషన్ రద్దీగా మారడంతో విజయవాడ నుంచి మిగతా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, తిరుపతి, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు సహా పలు నగరాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. బెంగళూరు నుంచి కూడా ఏపీకి వివిధ ప్రాంతాలకు ఇవాళ 323 బస్సు సర్వీసులు మొదలవ్వగా.. 12న 269 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అయితే ఈ ప్రత్యేక బస్సులన్నీ సాధారణ ఛార్జీలకే నడుపుతుండడం విశేషం. ఓటు వేయడానికి వెళ్లేవారి కోసమే కాకుండా ఓటు వేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి