RTC కండక్టర్ మంచి పని.. కన్నీరు పెట్టుకున్న ప్రయాణికురాలు!

RTC కండక్టర్ మంచి పని.. కన్నీరు పెట్టుకున్న ప్రయాణికురాలు!

నిత్యం ఆర్టీసీ బస్సుల్లో వేలాదిమంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో వారి వస్తువులను మర్చిపోతుంటారు. కండక్టర్లు, డ్రైవర్లు నిజాయితీ చాటుకుంటూ..బాధితులు కోల్పోయినా వస్తువులను తిరిగి అందిస్తున్నారు.

నిత్యం ఆర్టీసీ బస్సుల్లో వేలాదిమంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో వారి వస్తువులను మర్చిపోతుంటారు. కండక్టర్లు, డ్రైవర్లు నిజాయితీ చాటుకుంటూ..బాధితులు కోల్పోయినా వస్తువులను తిరిగి అందిస్తున్నారు.

నేటికాలంలో పరాయి సొమ్ము దొరికేతే మూడో కంటికి తెలియకుండా దాచుకునే వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో విలువైన వస్తువులు పోతే వాటిపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ఇలాంటి సమాజంలో నిజాయితీ పరులు కూడా ఉన్నారు. పరుల సొమ్ము పాము వంటిది అని, పరాయి వాళ్ల కష్టం మనకు వద్దు అని నిజాయితీగా ఉండే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారి చేతిలో నగదు పడితే మాత్రం తిరిగి బాధితుల చేతికి చేరుతుంది. ఆ కోవకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. వారు చేసిన పనికి ప్రయాణికులు రాలు కన్నీరు పెట్టుకుంది. మరి.. అసలు ఏమి జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

 ఆంధ్రప్రదేశ్  అనకాపల్లి జిల్లాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ తన నిజాయితీనీ చాటుకున్నారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ఎంపీ రావు ఓ మహిళా ప్రయాణికులు రాలు పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేశారు. బుధవారం నర్సీపట్నం నుంచి విశాఖకు బయలుదేరిన బస్సులో ఓ ప్రయాణికురాలు  ఎక్కింది.  ఈ క్రమంలోనే  బస్సులో బ్యాగ్‌ మరిచిపోయి.. ఆమె విశాఖపట్నంలో బస్సును దిగిపోయారు. ఆ తర్వాత బస్సులోని ఓ సీటులో బ్యాగ్‌ ఉండటాన్ని కండక్టర్‌ గమనించారు. వెంటనే బ్యాగ్ తీసి చూసి షాకయ్యారు. అందులో రూ.20 వేల నగదు, డాక్యుమెంట్లు పరిశీలించారు. ఆ బ్యాగును తీసుకుని సంబంధిత ప్యాసింజర్ సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమె డిపోకు చేరడంతో ఆమెకు డబ్బుల్ని, పత్రాలను అందజేశాడు. దీంతో తాను పోగొట్టుకున్న వస్తువులు దొరకడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇక కండక్టర్ చేసిన పనికి డిపో మేనేజన్‌ థీరజ్‌ ఇతర అధికారులు తోటి సిబ్బంది ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇదే సమయంలో మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా తన నిజాయితీ చాటుకున్నాడు. బస్సులో విలువైన నగదు, నగలు మర్చిపోయిన ఒక మహిళలుకు ఆర్టీసీ డ్రైవర్లు అప్పగించారు. ఆగష్టు 4న తిరువూరు నుంచి మంత్రాలయం వెళ్లే తిరువూరు డిపో బస్సులో గుంటూరుకు చెందిన వీరలక్ష్మి ఎక్కారు. ఆమె విజయవాడ నుంచి ప్రయాణించారు. ఈ క్రమంలోనే ఆమె కర్నూల్లో బస్సు దిగి వెళ్లే సమయంలో బస్సులో పర్సును మర్చిపోయారు. ఆ తర్వాత పర్సు సంగతి గుర్తుకొచ్చింది. ఈ క్రమంలోనే వెంటనే తిరువూరు డిపో ఫోన్‌ చేసి డైవర్ నంబర్ తీసుకొని ఫోన్ చేశారు. తాను ప్రయాణించిన బస్సులోని సీటు వివరాలు తెలియజేసి తాను పర్సు మరిచిపోయిన ఆ డ్రైవర్ కి తెలిపింది. ఇక ఆమె ఇచ్చిన సమచారంతో.. పర్సును గుర్తించి భద్రపరిచారు. ఇక మంత్రాలయం నుంచి బస్సు తిరుగు ప్రయాణంలో కర్నూలు డిపో ట్రాఫిక్‌ అధికారి సమక్షంలో రూ.3, 500 నగదుతో పాటు లక్ష విలువైన బంగారు నగలను, రెండు ఏటీఎం కార్డులను ఆమెకు తిరిగి అప్పగించారు. ప్రయాణికురాలు వీరలక్ష్మి  సంతోషం వ్యక్తం చేశారు. ఆ డైవర్ల నిజాయితీని  ఆమె ప్రశంసించారు. ఇలా పలు సందర్భాల్లో చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తమ నిజాయితీని చాటుకు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

Show comments