iDreamPost
android-app
ios-app

APలో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు.. వారికి మాత్రమే అవకాశం!

  • Published Feb 01, 2024 | 8:50 AM Updated Updated Feb 01, 2024 | 8:50 AM

APNRTS: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అర్హులైన వారికి రూ.10 లక్షలు అందిస్తోంది. ఆ పథకం వివరాలు..

APNRTS: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అర్హులైన వారికి రూ.10 లక్షలు అందిస్తోంది. ఆ పథకం వివరాలు..

  • Published Feb 01, 2024 | 8:50 AMUpdated Feb 01, 2024 | 8:50 AM
APలో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు.. వారికి మాత్రమే అవకాశం!

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇందుకోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ఈ 56 నెలల పాలన కాలంలో ఇచ్చిన హామీలన్నింటిని పూర్తిగా అమలు చేయడమే కాక.. ప్రజల కోసం అనేక నూతన కార్యక్రమాలను ప్రారంభించి అమలు చేశారు. ఇక సాయం అని కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేపట్టిన మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు సైతం.. ఏపీ విధానాల మీద ప్రశంసలు కురిపించారు. కేవలం రాష్ట్రంలో ఉన్న వారి కోసమే కాక.. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకోవడంలో కూడా ముందున్నారు సీఎం జగన్‌. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

ఏపీ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన రాష్ట్ర వాసులు మరణిస్తే.. వారి కుటుంబానికి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇక ఈ పథకానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోందని.. దాన్ని తాము సులభతరం చేసి.. అందరికీ చేరువ చేశామని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ (ఏపీ ప్రవాస తెలుగు సంఘం) అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 2.55 లక్షల మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు. 489 మంది లబ్ధిదారులకు సుమారు రూ.2.44 కోట్ల పరిహారం అందజేశామన్నారు.

10 lakhs per person in AP

అంతేకాదు విద్యా వాహిని ద్వారా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం అక్కడ అవకాశాలు, యూనివర్శిటీల వివరాలు అందించడం కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెంకట్ తెలిపారు. అంతేకాక అత్యవసర సమయాల్లో నిరాశ్రయులైన, అర్హులైన వలసదారులను, ఏజెంట్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వారిని.. భారత రాయబార కార్యాలయాల సాయంతో రక్షించి.. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కృషి చేస్తుందని తెలిపారు. అలానే విదేశాలకు వెళ్లాలనుకునే వారు.. ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్నవారు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల వారు సమస్యలో ఉంటే.. త్వరగా ఆదుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రవాసాంధ్ర భరోసా బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వతంగా ఏదైనా అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. ఒకవేళ ప్రమాదం వల్ల గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లిస్తారు. అలాగే ప్రమాదం, అస్వస్థతకు గురైనవారికి స్వదేశానికి వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీలు చెల్లిస్తారు. ఈ బీమా వల్ల ఇంకా అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయిని.. కనుక ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని వెంకట్‌ తెలిపారు.

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ 24/7 హెల్ప్‌లైన్‌ +91-863-2340678.. +91 85000 27678 (వాట్సాప్) అందుబాటులో ఉంటుంది. అలాగే వెబ్ సైట్‌ https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_newలో లాగిన్ అవ్వాలి. అలాగే insurance@apnrts.com; helpline@apnrts.com కు మెయిల్ చేయొచ్చు. ఏపీఎన్ఆర్టీఎస్‌కు సంబంధించిన అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.