iDreamPost
android-app
ios-app

కౌలు రైతులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్! త్వరలోనే..

  • Author Soma Sekhar Published - 07:34 AM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 07:34 AM, Mon - 21 August 23
కౌలు రైతులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్! త్వరలోనే..

రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రైతుల శ్రేయస్సు కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. ఇక ఇప్పటికే కౌలు రైతులకు కార్డులు జారీ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా 7.77 లక్షల మందికి ఈ ఏడాది కార్డులు జారీ చేశారు. ఇక వీరి వివరాలను రైతు భరోసా పోర్టల్ లో కూడా అప్ లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు తీపి కబురు చెప్పింది జగన్ సర్కార్. రైతు భరోసా పోర్టల్ లో నమోదు అయిన 7.77 లక్షల మందికి వచ్చే నెలలోనే వారి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు అయిన 7.77 లక్షల మంది కౌలు రైతులకు సెప్టెంబర్ లో తొలి విడత సాయం అందించనున్నారు. నేరుగా రైతుల అకౌంట్ లోనే ఈ డబ్బులు జమ అవుతాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం కౌలు రైతులకు ఏకంగా రూ. 4 వేల కోట్ల పంట రుణాలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటుగా.. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ ఫలాలు అందాలని జగన్ సర్కార్ లక్ష్యాంగా పెట్టుకుంది. కాగా.. 2019లో పంట సాగుదారుల హక్కుపత్రాల (CCRC) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో ఈ కౌలు కార్డులు జారీ చేస్తున్నారు.

ఈ కార్డుల ద్వారా గత నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటుగా అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రభుత్వం కౌలు రైతులకు అందిస్తోంది. కాగా.. గడిచిన 4 ఏళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ. 6,668.64 కోట్ల పంట రుణాలను అందించింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 3.92 లక్షల మంది కౌలుదారులకు రైతు భరోసా కింద రూ. 529 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. ఇక వచ్చే నెలలోనే రైతు భరోసా తొలి విడత నిధులు రైతుల అకౌంట్ లో పడతాయని ప్రభుత్వం తెలపడంతో.. కౌలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతన్న సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తాడు: మంత్రి బొత్స