iDreamPost
android-app
ios-app

APపదో తరగతి ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డు! 600కి 599 మార్కులు సాధించిన విద్యార్థిని

  • Published Apr 22, 2024 | 1:29 PM Updated Updated Apr 22, 2024 | 1:29 PM

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థిని 600 కి 599 మార్కులు సాధింటి స్టేట్‌ టాపర్‌గా నిలవడమే కాక.. ఆల్‌ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ వివరాలు..

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థిని 600 కి 599 మార్కులు సాధింటి స్టేట్‌ టాపర్‌గా నిలవడమే కాక.. ఆల్‌ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 22, 2024 | 1:29 PMUpdated Apr 22, 2024 | 1:29 PM
APపదో తరగతి ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డు! 600కి 599 మార్కులు సాధించిన విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు నేడు అనగా.. ఏప్రిల్‌ 22, సోమవారం నాడు రిలీజ్‌ అయ్యాయి. అయితే ఈ ఏడాది పది ఫలితాల్లో ఓ విద్యార్థిని ఆల్‌ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. పదో తరగతి పరీక్షల చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పదో తరగతిలో ఏకంగా 600 మార్కులకు గాను.. 599 మార్కులు తెచ్చుకుని ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది ఓ విద్యార్థిని. ఇప్పుడు ఆమె పేరు, వివరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మొగిపోతున్నాయి. సదరు విద్యార్థినికి వచ్చిన మార్కులు చూసి ప్రతి ఒక్కరు షాక్‌ అవుతున్నారు. అంతేకాక ఆ ఒక్క మార్కు ఎక్కడ పోయింది అని ప్రశ్నిస్తున్నారు. వాటన్నింటికి సమాధానం ఇక్కడ మీకోసం..

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఓ విద్యార్థిని సరికొత్త చరిత్ర సృష్టిచింది. పదో తరగతి చరిత్రలోనే 599 మార్కులు సాధించి ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇంతకు ఆ విద్యార్థిని ఎవరంటే.. ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి. పదో తరగతిలో 600కు గాను 599 మార్కులు సాధించి.. టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది మనస్వి. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి. మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. సదరు విద్యార్థినికి అభినందనలు తెలుపుతున్నారు.

సోమవారం నాడు విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో 6.16 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్ధుల్లో 86.69 శాతం (5,34,574 ) మంది పాస్‌ అయ్యారు. జిల్లాల వారీగా ఉత్తీర్ణత చూస్తే.. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 96.37 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది పది ఫలితాల్లో.. బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలానే.. అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికంగా పాస్‌ అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం 12 రకాల మేనేజ్‌మెంట్లలో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ స్కూల్స్ విద్యార్ధులు అత్యధికంగా 98.43 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3,743 కేంద్రాలలో 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2,803 పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.