Dharani
Dharani
 
        
జర్నలిస్ట్‌గా.. విశేష సేవలందించి.. మీడియా రంగంలో ఎన్నలేని కృషి చేసిన సీనియర్ జర్నలిస్ట్.. సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం మృతి చెందారు. విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా ఉండే వ్యక్తిగా కృష్ణారావు గుర్తింపు తెచ్చుకున్నారు. అనలిస్ట్‌గా పని చేసిన ఆయన రాజకీయ వర్గాల్లో బాబాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీహెచ్‌ఎంవీ కృష్ణారావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. అలానే ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తదితరులు కృష్ణారావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
