iDreamPost
android-app
ios-app

రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం

  • Published Aug 24, 2024 | 7:30 PM Updated Updated Aug 24, 2024 | 7:30 PM

Rain Alert For AP People: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు మరోసారి కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వారిని బయటకు రావద్దని హెచ్చరించింది.

Rain Alert For AP People: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు మరోసారి కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వారిని బయటకు రావద్దని హెచ్చరించింది.

  • Published Aug 24, 2024 | 7:30 PMUpdated Aug 24, 2024 | 7:30 PM
రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. వచ్చే రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. వేటకు వెళ్లే మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఆదివారం నాడు ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లోని వర్షాల ప్రభావంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలానే కాకినాడ, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఆదివారం నాడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

కాగా మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో శ్రీశైలంలో నీటిమట్టం మళ్ళీ పెరుగుతుంది. శ్రీశైలం జలాశయం నిండితే మరోసారి గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom