iDreamPost
android-app
ios-app

AP:మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు.. అక్కడకు ఎలా వచ్చాయంటే?

  • Published Apr 19, 2024 | 10:46 AM Updated Updated Apr 19, 2024 | 10:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. మర్రి చెట్టు తొర్రలో 64 లక్షల రూపాయలు బయటపడ్డాయి. అసలు ఆ మొత్తం అక్కడికి ఎలా వచ్చింది.. ఎవరు పెట్టారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. మర్రి చెట్టు తొర్రలో 64 లక్షల రూపాయలు బయటపడ్డాయి. అసలు ఆ మొత్తం అక్కడికి ఎలా వచ్చింది.. ఎవరు పెట్టారంటే..

  • Published Apr 19, 2024 | 10:46 AMUpdated Apr 19, 2024 | 10:46 AM
AP:మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు.. అక్కడకు ఎలా వచ్చాయంటే?

కథలు, సినిమాల్లో.. మాయల మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉండేదని విన్నాం.. చూశాం. ఇక చాలా సినిమాల్లో మర్రి చెట్టును దెయ్యాలకు ఆవాసంగా చూపిస్తారు. చెట్టు తొర్రలో దెయ్యాలు నివాసం ఉన్నట్లు కథల్లో కూడా చెబుతారు. చాలా మంది ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దాటి రావటాలంటే భయంతో వణికిపోతారు. మర్రి చెట్టుకు.. మనకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ధనం, విలువైన వస్తువులు దాచుకోవాలంటే మర్రి చెట్టు తొర్ర మంచి ఆప్షన్‌ అని మనకు కథల్లో చెప్పేవారు. అయితే అలాంటి ఓ కథే నిజ రూపం దాల్చింది. మర్రి చెట్టు తొర్రలో 64 లక్షల రూపాయలు బయటపడటం సంచలనంగా మారింది. ఇంతకు ఆ డబ్బులు అక్కడకు ఎలా వచ్చాయి.. ఎవరు పెట్టారో తెలియాంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు వెళ్లాల్సిందే. పదండి ఆ కథేంటో చూద్దాం..

ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం (ఏప్రిల్‌ 18) వెలుగు చూసింది. మరి ఇంతకు ఈ డబ్బు ఇక్కడకు ఎలా వచ్చింది అంటే.. ఇదేదో మాయో, మంత్రమో కాదు.. ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తాన్ని దొంగతనం చేశాడు. ఆ తర్వాత పోలీసులకు భయపడి.. ఆ డబ్బును మర్రి చెట్టు తొర్రలో దాచాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

సీఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం నాడు అనగా ఏప్రిల్‌ 18 నాడు వివిధ ఏటీఎం మెషినల్లో నగదు నింపడం కోసం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలు దేరారు. చీమకుర్తి మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్ల్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లో ఉన్న వివిధ ఏటీఎం మెషిన్లలో నింపేందుకు ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో.. భోజనం చేయడం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఉన్న ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద తమ వాహనాన్ని ఆపారు. తినేందుకు.. బంకులోని ఓ గదిలోకి వెళ్లారు. సీఎంఎస్‌ సిబ్బంది రాకను గమనించిన నిందితుడు.. వారు భోజనం చేయడానికి వెళ్లడం చూశాడు. ఇదే అదునుగా భావించి.. చోరికి పాల్పడ్డాడు. ముఖానికి ముసుగు ధరించి వచ్చి.. వాహనం తాళం పగులగొట్టి.. దానిలో నుంచి 64 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లాడు.

భోజనం ముగించికుని వచ్చిన సిబ్బంది వాహనం వద్దకు తిరిగి వచ్చి చూడగా.. దాని డోర్‌ ఒపెన్‌ చేసి ఉంది. అనుమానం వచ్చి లోపల చెక్‌ చేయగా.. అందులో నగదు కనిపించలేదు. చెక్‌ చేయగా.. వారు తెచ్చిన 68 లక్షల్లో 64 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. దాంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి.. పెట్రోలు బంకు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలించారు. దానిలో ముసుగు ధరించి వచ్చిన ఓ వ్యక్తి వాహనం తాళం పగులగొట్టి.. చోరికి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టి.. గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక నిందితుడి వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్‌ అయ్యారు. అతడు గతంతో సీఎంఎస్‌ సంస్థలో పని చేసిన వ్యక్తే కావడం గమానర్హం. నిందితుడిని మహేష్‌గా గుర్తించారు. ఇతడు గతంలో సీఎంఎస్‌లో పని చేసి.. కొన్నాళ్ల తర్వాత అక్కడ ఉద్యోగం మానేశాడు. ఇక నగదు దొంగిలించిన మహేష్‌.. తన సొంత ఊరు సంతనూతలపాడు మండలం, కామేపల్లివారిపాలెలంలోని అతడి ఇంటికి సమీపంలోని ఓ మర్రిచెట్టు తొర్రలో దాచి పెట్టాడు. ఇక మహేష్‌ స్వగ్రామానికి చేరుకున్న పోలీసులు.. తమదైన శైలిలో అతడిని విచారించగా.. నిందితుడు నేరాన్ని అంగికరించడమే కాక నగదును పోలీసులకు అప్పగించాడు. అలా గంటల వ్యవధిలోనే పోలీసులు.. ఈ మొత్తాన్ని కలెక్ట్‌ చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.