iDreamPost
android-app
ios-app

APలో రేషన్‌ కార్డుదారులకు మంత్రి శుభవార్త.. వచ్చే నెల నుంచి తక్కువ ధరకే

  • Published Jul 29, 2023 | 8:27 AM Updated Updated Jul 29, 2023 | 8:27 AM
  • Published Jul 29, 2023 | 8:27 AMUpdated Jul 29, 2023 | 8:27 AM
APలో రేషన్‌ కార్డుదారులకు మంత్రి శుభవార్త.. వచ్చే నెల నుంచి తక్కువ ధరకే

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇక ఎక్కడా లేని విధంగా రేషన్‌కార్టుదారులకు ఇవ్వాల్సిన సరుకులను ఇంటి వద్దకే తెచ్చి అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేషన్‌కార్డు మీద అనేక సరుకులను సబ్సిడీ మీద తక్కువ ధరకే అందజేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక మిగతా రాష్ట్రాలకు భిన్నంగా చిరుధాన్యాలు, గోధుమ పిండి, కంది పప్పు వంటి పదార్థాలను తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

గోధుమ పిండి, కంది పప్పు వంటి పదార్థాలను కూడా బయట మార్కెట్‌తో పోలిస్తే.. రేషన్‌ దుకాణాల్లో తక్కువ ధరకే అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. రేషన్‌ కార్డు మీద కందిపప్పు ఇస్తోన్నప్పటికి కొందరు దాన్ని తీసుకోవడం లేదని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరారు. ఒకవేళ వారు తీసుకుంటామంటే మరో అవకాశం ఉందన్నారు. వచ్చే నెల నుంచి చౌక డిపోల ద్వారా ప్రజలకు కందిపప్పు ఇచ్చేందుకు చర్యలు చేపడతున్నట్లు తెలిపారు. వారికి జూన్‌, జులై నెలల్లో ఇవ్వకుండా ఆపేసిన కందిపప్పు కోటాను.. ఆగస్టు నెల రేషన్‌తో కలిపి ఇస్తామని తెలిపారు. అంతేకాక రేషన్ డీలర్లను తొలగిస్తున్నామని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్ డీలర్‌ని కూడా తొలగించే ప్రసక్తే లేదని మంత్రి గతంలోనే చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలోనైనా సరే.. సరుకులు అధిక ధరలకు అమ్మినా.. రేట్లు పెంచినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాక పోర్టుపైడ్ రైస్‌లో.. ప్లాస్టిక్‌ బియ్యం కలుపుతున్నారని చాలా మంది అపోహపడుతున్నారని తెలిపారు మంత్రి. అయితే ఇందులో వాస్తవం లేదని.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే పోర్టిపైడ్‌ రైస్‌ అందజేస్తున్నామన్నారు. ఆగస్టు నెల నుంచి చౌక డిపోల ద్వారా ప్రజలకు కందిపప్పు ఇచ్చేందుకు చర్యలు చేపడతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డీలర్లకు 1 రూపాయి కమిషన్ ఇస్తున్నామని.. సీఎం జగన్‌తో మాట్లాడి.. రేషన్‌ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ పెంచే ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.