ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. సోమవారం(నవంబర్ 27) అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు లోనైయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. ఆయన్ని హుటాహుటిన విజయవాడంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఆయన తన ఛాతీలో నొప్పిగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పగా.. వెంటనే వారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్లు తెలిపారు. కాగా.. మంత్రి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. వేణుగోపాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.