iDreamPost
android-app
ios-app

తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సంచలన కామెంట్స్!

తెలంగాణ విద్యావ్యవస్థపై  ఏపీ మంత్రి బొత్స సంచలన కామెంట్స్!

ఏదో ఒక సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, మంత్రులు పరస్పరం విమర్శించుకుంటారు. తమ రాష్ట్రం గొప్ప అంటే తమ రాష్ట్రం గొప్ప అనే రీతిలో వారి మాటలు ఉంటాయి. అలానే ఇరు రాష్ట్రాల మంత్రులు.. పలు సందర్భాల్లో పక్క రాష్ట్రంపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో తెలంగాణ మంత్రి హారీశ్ రావు  చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి. ఆ తరువాత ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.  తాజాగా తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

గురువారం విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న విద్యా సంస్కరణల గురించి వివరించారు. ఇదే సమయంలో  తెలంగాణ విద్యా వ్యవస్థపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడటం సరి కాదన్నారు.  ఇంకా మంత్రి మాట్లాడుతూ..” తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ వేరు, మన రాష్ట్ర ఇంజనీరింగ్  వేరు. మనం ఒక్క విషయం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడితే  తెలంగాణ అని ఎత్తుతారు. తెలంగాణలో జరిగే అడ్మిషన్ల  గురించి మనం రోజూ న్యూస్ పేపర్ల చూస్తుంటాము. ఆఫ్ట్రాల్ వాళ్లు.. సర్వీస్ కమిషన్ పరీక్షలే ఏ రకంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అందులో చూచి రాతలు రాసి, స్కామ్స్ జరిగి, ఎంత మంది అరెస్ట్ అవుతున్నారో చూస్తున్నాము.

టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి వాళ్లది. అందుకని ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రాన్ని పోల్చడం సరికాదు. ఎవరి విధానం వారిది, ఎవరి ఆలోచన వారిది. అలాగానే నేను ఏ రాష్ట్రంపై కామెంట్స్ చేయడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యావిధానాన్ని కానీ, నేడు ఏపీలో ఉన్న విద్యాను కానీ దేశం మొత్తం చూస్తుంది. ఏపీ ప్రభుత్వం విద్యా విధానంపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఎవరు ఏ అంశం గురించి చెప్పిన..  పెడచెవిన పెట్టకుండా.. అందులో ఏమి మంచి ఉందో చూసుకుంటూ ముందుకెళ్తున్నాం” అని మంత్రి బొత్సా కామెంట్స్ చేశారు. మరి.. ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.