iDreamPost
android-app
ios-app

పవన్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్: మంత్రి అంబటి

పవన్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్: మంత్రి అంబటి

ఏపీలో రాజకీయం మంచి హాట్ హాట్ గా ఉన్నాయి. దేశంలో ఎక్కడిలేని రాజకీయం ఏపీలో కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో రాజకీయం అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు సాగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తరువాత ఏపీ పొలిటకల్ సీన్ మారిపోయింది. వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు మారిపోయింది. పవన్ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే పవన్ విమర్శలకు వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా పవన్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్ అంటూ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.

శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి యాత్రపై, పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాటలపై నిలబడలేని వ్యక్తి పవన్ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.  పవన్ అప్పుడే ఊగిపోతాడు.. అప్పుడే సాగిపోతాడని అన్నారు. చెప్పులు పట్టుకొని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైందని నిలదీశారు. పవను ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్ అని మంత్రి దుయ్యపట్టారు. రాజకీయాల్లోనే కాదు, వ్యక్తిగతంగాను అతనితో ఎవరూ నడవరని ఆయన అన్నారు.

ఇంకా అంబటి మాట్లాడుతూ..”  పవన్ నువ్వు చేస్తున్నది వారాహి యాత్ర కాదు. వరాహి యాత్ర. పవన్ రెండు విడుతలుగా యాత్రలు చేస్తున్నారు.  ఉభయగోదావరి జిల్లాలో మొదటి విడుతగా, రెండో విడుతలో పశ్చిమ గోదావరిలో పర్యటన చేస్తున్నారు. అసలు ఉభయగోదావరిలోనే  ఎందుకు తిరుగుతున్నావు?. ఉభయ గోదావరిలోని కాపులను మచ్చిక చేసుకుని, రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిన టీడీపీకి కాపులు వ్యతిరేకంగా ఉన్నారు.  కాపు ఉద్యమ నాయకులను చంద్రబాబు చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో కాపులందరూ చస్తే చంద్రబాబుకు ఓటు వేసేది లేదంటున్నారు.

వాళ్లందరినీ మచ్చిక  చేసుకోవడానికి ఆ దుష్టచతుష్టయం చెప్పినట్లు పవన్ చేస్తున్నాడు. ఎల్లో మీడియా, చంద్రబాబులు చెబితే అక్కడ మాత్రమే తిరుగుతున్నాడు.  పిచ్చికూతలు కూసే పవన్ కల్యాణ్ నీకు భవిష్యత్తు లేదు. రాజకీయాలకు పనికిరావు. నిన్ను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవహించింది. అందుకే అప్పుడే ఆవేశం, ప్రేమ, తిట్లు, ప్రశంసలు అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి రకరకలా డిజార్డర్స్ ఉన్న వ్యక్తివి నువ్వు. ఎవ్వరూ నీ వెంట నడవలేరు” అంటూ పవన్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మరి.. పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు! ఐరాసలో ‘నాడు-నేడు’ స్టాల్..

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişbahis siteleri