జస్టిస్‌ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు.. 4 ఏళ్లలో ఏకంగా 9,141 తీర్పులు!

జస్టిస్‌ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు.. 4 ఏళ్లలో ఏకంగా 9,141 తీర్పులు!

చాలా మంది  తమ వృతిల్లో విశేషమైన ప్రతిభ చూపించి.. అరుదైన రికార్డులను సృష్టిస్తుంటారు. అలానే ఆటలు, రాజకీయం, న్యాయవస్థ, విద్యావ్యవస్థ.. ఇలాంటిలో అరుదైన రికార్డులు నమోదవుతుంటాయి. ఇక న్యాయవ్యవస్థ విషయానికి వస్తే.. ఎంతో మంది తమదైన విలక్షణ తీర్పులతో చరిత్ర లో నిలిపోయారు. అంతేకాక మరికొందరు అత్యధిక తీర్పులు ఇస్తూ రికార్డులు సృష్టిస్తుంటారు. తాజాగా ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి కూడా అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన ఫిర్యాదుల్లో 9,141 కేసులు విచారణ చేశారు.. అలాగే తీర్పులు వెల్లడించారు. మరి.. ఈ అరుదైన రికార్డు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. ఈ పేరు న్యాయవ్యవస్థపై అనుభవం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తన సర్వీస్ లోనే పలు కీలక కేసుల్లో సంచలన తీర్పులు వెల్లడించారు. 2019 సెప్టెంబరు 15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ లోకాయుక్త పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దీంతో ఆపోస్టును కూడా లక్ష్మణ రెడ్డే నిర్వర్తిస్తున్నారు. ఇలా లోకాయుక్త కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను రెండు రకాలుగా విభజించినా తీర్పులు మాత్రం ఆయన ఒక్కరే ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే  ఈ నాలుగేళ్లలో ఏకంగా 9,141 కేసుల తీర్పులను వెల్లడించారు.

జస్టిస్‌ లక్ష్మణరెడ్డి 2020లో 1,928 కేసులకు తీర్పులు వెల్లడించారు. అలానే 2021లో 2,307, 2022లో 2,874, 2023లో 2,032 కేసుల్లో ఆయన తీర్పులు వెల్లడించారు. జిల్లా జడ్జి హోదా కలిగి ఉండే డైరెక్టర్‌(లీగల్‌) సహకారంతో కేసులను త్వరగా విచారణ చేయడానికి జస్టిస్ లక్ష్మణ రెడ్డి చొరవ తీసుకున్నారు. దేశంలో ఏ లోకాయుక్త జస్టిస్ నాలుగేళ్లలో ఈ స్థాయి భారీ సంఖ్యలో తీర్పులు వెల్లడించలేదని చెబుతున్నారు. జస్టిస్ లక్ష్మణ రెడ్డి అత్యధిక తీర్పులు వెలువరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని లోకాయుక్త కార్యాలయ రిజిస్ట్రార్‌ తెలిపారు. మరి.. జస్టిస్ లక్ష్మణ రెడ్డి సాధించిన అరుదైన రికార్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments