iDreamPost
android-app
ios-app

ఈ డాక్టర్‌ ఆశలన్ని ఆడియాసలయ్యాయి.. ఆస్ట్రేలియాలో అత్యంత దారుణంగా

  • Published Mar 09, 2024 | 8:44 AM Updated Updated Mar 09, 2024 | 8:44 AM

ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లిన యువ వైద్యురాలు ఒకరు.. అత్యంత దారుణంగా అక్కడే మృత్యువాత పడింది. ఆ వివరాలు..

ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లిన యువ వైద్యురాలు ఒకరు.. అత్యంత దారుణంగా అక్కడే మృత్యువాత పడింది. ఆ వివరాలు..

  • Published Mar 09, 2024 | 8:44 AMUpdated Mar 09, 2024 | 8:44 AM
ఈ డాక్టర్‌ ఆశలన్ని ఆడియాసలయ్యాయి.. ఆస్ట్రేలియాలో అత్యంత దారుణంగా

ఉన్నత విద్య అభ్యసించాలి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలి.. మంచి సంపాదన.. ఇదుగో ఇలాంటి ఆశలతో ఎందరో యువతీయువకులు విదేశాల బాట పడుతున్నారు. అక్కడకు వెళ్లి అష్టకష్టాలు పడుతూ.. భవిష్యత్తు గురించి కష్టపడుతున్నారు. కానీ ఈమధ్య కాలంలో విదేశాలకు వెళ్లిన యువతీయువకులు ప్రమాదాల బారిన పడి.. లేదంటే అక్కడ దుండగుల చేతిలో దాడులకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. డాక్టర్‌గా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావించిన ఆమె.. ఉన్న ఊరిని, సొంత వారిని వదులుకుని.. విదేశాలకు వెళ్లింది. అయితే దురదృష్టం కొద్ది అక్కడ అత్యంత దారుణంగా మరణించింది. ఆ వివరాలు..

తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వైద్యురాలు ఒకరు ఆస్ట్రేలియాలో అనుకోని ప్రమాదానికి గురై కన్ను మూసింది. సరదాగా స్నేహితులతో గడపడానికి ట్రెక్కింగ్‌కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంది. మృతురాలు కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన ఉజ్వలగా గుర్తించారు. వైద్యురాలి మృతి గురించి.. ఆస్ట్రేలియాలోని ఆమె స్నేహితులు ఉజ్వల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వైద్యురాలిగా ఉన్నత స్థాయికి వెళ్తుందని భావించిన కుమార్తె ఇలా అత్యంత దారుణంగా మృత్యువాతపడటం ఆమె తల్లిదండ్రులను కుదిపేసింది. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని భావించిన కుమార్తె.. ఇంత చిన్న వయసులోనే చనిపోవడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కృష్ణా జిల్లా, గన్నవరంకు చెందిన ఉజ్వల.. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం.. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లింది. అయితే అనుకోకుండా మృత్యువాత పడింది. ఈ రోజు అనగా శనివారం నాడు.. ఉజ్వల మృతదేహాన్ని కృష్ణాజిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించనున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం ఎలుకపాడులో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైద్యురాలిగా జీవితంలో ఉన్నత స్థితికి చేరాల్సిన కుమార్తె.. ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş