P Krishna
AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాల వచ్చేశాయి. ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాల వచ్చేశాయి. ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
P Krishna
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ శుక్రవారం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఏన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ కు తెర పడింది. వివరాల్లోకి వెళితే..
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సౌరబ్ గౌర్. ఈసారి కూడా ఏపీలో బాలికలే సత్తా చాటారని ఆయన తెలిపారు. ఫస్ట్ ఇయర్ 67 శాతం, సెకండ్ ఇయర్ 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం ఫస్ట్ ప్లేస్ లో కృష్ణా జిల్లా ఉండగా.. సెకండ్ ప్లేస్ లో గుంటూరు, థార్డ్ ప్లేస్ లో ఎన్ టీఆర్ జిల్లా నిలిచాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రెగ్యూలర్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 10,52,673 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,17,617 మంది ఉంటే.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 52,900 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
పరీక్ష ఫలితాలను చూడాలనుకునే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేది నమోదు చేయడం ద్వారా అధికారిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ ఆంధ్రప్రదేశ్ BIEAP లేదా https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా, బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యూకేషన్ ఏపీ (బీఐఇఎపీ) రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించిందది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రెండూ ఇకేసారి రోజు వారి షిఫ్ట్ లో నిర్వహించారు. ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం సప్లిమెంటరీ పరిక్షల తేదీని కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మే 24 వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షు ఉంటాయని పేర్కొంది.