iDreamPost
android-app
ios-app

శ్రీవారి మెట్లమార్గంలో గుండెపోటుతో DSP మృతి!

ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎందరో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజాగా విధుల్లో ఉన్న పోలీసులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంది.

ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎందరో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజాగా విధుల్లో ఉన్న పోలీసులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంది.

శ్రీవారి మెట్లమార్గంలో గుండెపోటుతో DSP మృతి!

ఇటీవల కాలంలో గుండెపోటుతో జరిగే మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు గుండె పోటు అంటే బాగా వయస్సు మీద పడినవారికి వస్తుండేది. అయితే నేటి కాలంలో  వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. పది నెలల పసి బిడ్డ నుంచి పండు ముసలి వారి వరకు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో గుండెపోటు అనేది కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా యువత హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు. అంతేకాక విధుల్లో ఉండే పోలీసులు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు సైతం  దీని కారణంగా మృత్యుఒడికి చేరుతున్నారు. తాజాగా విధుల్లో ఉన్న డీఎస్పీ ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తిరుపతిలో డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు  శ్రీవారి మెట్టు మార్గంలో ఇంటెలిజెన్స్  డీఎస్పీ  కృపాకర్ మరణించారు. శ్రీవారి మెట్ల మార్గంలోని 1805వ మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. ఆయన సిబ్బంది గమనించి వెంటనే  రూయా ఆస్పత్రికి తరలించారు. అయితే రూయా ఆస్పత్రికి తరలించే లోపే  ఆయన మృతి చెందారు. డీఎస్పీ కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి  గ్రామం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం  కృపాకర్ తిరుమలకు వచ్చారు. కృపాకర్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26,27 తేదీల్లో తిరుపతిలో ప్రయటించనున్నారు.  ఈనెల 26వ తేదీ సాయంత్ర తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి.. రాత్రి బస చేస్తారు. 27వ తేదీ, సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి 1:30నిమిషాలకు హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12:45 బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం కరీంనగర్ బయలుదేరి.. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సోమవారం సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో  తిరుపతికి  ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ వచ్చారు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై.. మృతి చెందారు. డీఎస్పీ మృతితో ఆయన కుటుంబంలో విషాధ ఛాయాలు అలుముకున్నాయి. మరి..  వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటులు రావడానికి గల కారణాలు ఏమిటి ?. మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.