Dharani
స్కూల్స్‌కు వరుసగా 9 రోజులు సెలవులు రానున్నాయి. మరి ఇన్ని రోజులు ఎందుకు సెలవులు అంటే..
స్కూల్స్‌కు వరుసగా 9 రోజులు సెలవులు రానున్నాయి. మరి ఇన్ని రోజులు ఎందుకు సెలవులు అంటే..
Dharani
విద్యార్థులకు పండగ లాంటి వార్త చెప్పనుంది ప్రభుత్వం. వారికి వరుసగా 9 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక మిగతా స్కూల్ విద్యార్థులకు మాత్రమే స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి హాఫ్ డే స్కూల్స్ మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. అయితే సోమవారం నుంచి అనగా మార్చి 18న ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇక వరుసగా 9 రోజులు సెలవులు ఎందుకు అంటే..
ఆంధ్రప్రదేశ్ మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్‌టికెట్లను కూడా విడుదల చేశారు. పది పరీక్షల నేపథ్యంలో మార్చి 18 నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలని డీఈఓ సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒంటిపూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలన్నారు.
అలాగే వరుసగా 9 రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. అయితే ఇవి అన్ని స్కూల్స్‌కి వర్తించవు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో.. ఎగ్జామ్ సెంటర్లుగా ఉన్న పాఠశాలలకు పరీక్షలు జరిగే రోజుల్లో సెలవు ప్రకటించినట్లు డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. మార్చి 18, 19, 20, 22, 23, 26, 27,28, 30 తేదీల్లో స్కూల్స్ సెలవులు ప్రకటించారు విద్యాశాఖ అధికారాలు.
సెలవులు ప్రకటించిన స్కూళ్లు మర్చి 24, 31, ఏప్రిల్ 7, 13, 14, 21 తేదీలలో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా స్థానిక గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో ప్రతి పాఠశాలలో తాగునీటి వసతి ఏర్పాటు చేసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పాఠశాలలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పాఠశాలల్లో ఎవరైనా వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులకు మజ్జిగ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సుధాకర్ రెడ్డి సూచించారు.
పాఠశాల సమయం ముగిసిన తర్వాత పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకాన్ని తప్పక అందించాలన్నారు. పరీక్షల నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్స్ వద్ద నో మొబైల్ జోన్ విధించారు. సెల్ ఫోన్స్ వాడకూడదని సూచించారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే.. 10 వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు.