Dharani
ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో రూ.1,294.58 కోట్లు జమ చేయనుంది. ఎందుకు.. ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో రూ.1,294.58 కోట్లు జమ చేయనుంది. ఎందుకు.. ఎప్పుడంటే..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేది ఆయన తపన. అందుకోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. రైతన్నల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఏపీ సర్కార్. దీనిలో భాగంగా వారికి పెట్టుబడి సాయంతో పాటు మద్దతు ధర కల్పించడం, రుణాలు ఇప్పించడం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆదుకోవడం వంటి సహాయక చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో భారీగా నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..
ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా.. ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.
ఇప్పటికే వైస్సార్ రైతు భరోసాతో పాటు.. సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నకలు రూ.1264.34 కోట్లు అందించగా.. మరోసారి అన్నదాతలకు భారీగా నగదు సాయం చేస్తున్నారు. కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోనున్నారు. ఇక ఏపీలో జగన్ సర్కార్.. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ఏ సీజన్‌కు సంబంధించి.. ఆ సీజన్ పూర్తి కాకముందే.. నష్టపరిహారాన్ని అందిస్తోంది. ఇక గతేడాది వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. గతంలో ఇది 84.94 లక్షల ఎకరాలుగా ఉండేది.
కరువు మండలాల ప్రకటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికలను తీసుకుంది. వీటి ఆధారంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి.. సీజన్ ముగియకముందే ప్రకటించింది. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత.. 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని తేల్చింది. అలానే మిచాగ్ తుపాను వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు.
మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 2023–24 సీజన్‌లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వ తేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని జమ చేయచేయనున్నారు సీఎం జగన్. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది.