Arjun Suravaram
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. తాజాగా ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. తాజాగా ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది
Arjun Suravaram
మనం సంపాదించిన ధనం చోరీకి గురికావచ్చు. అయితే మనం కూడబెట్టుకున్న విద్యా జ్ఞానాన్ని మాత్రం ఎవ్వరూ దొంగిలించ లేరు. ఎవరైన సరే ఐశ్వర్యం చేత కంటే విద్యతో ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పొందొచ్చు. అలానే మన పిల్లలు మనం ఇచ్చే నిజమైన ఆస్తి.. మంచి విద్యా. ఈ అంశాలను బలంగా నమ్మిన వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఓటు లేదని పిల్లలను నిర్లక్ష్యంగా చూసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. అయితే పిల్లలు ఓట్లు కాదని, రాష్ట్ర భవిష్యత్ అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకే విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈక్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం ఓ కీలక ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్ ఎక్స్ తో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించారు.
ఇక ఎడ్ క్స్ తో జరిగిన సమావేశంలో సీఎం జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న విజన్, ఆలోచనల గురించి సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పిల్లలు ప్రపంచం స్థాయిలో పోటీ పడాలని , అప్పుడే భవిష్యత్తు మారుతుందని పనరుద్ఘాటించారు. ఏపీ చదువుల చరిత్రలో ఇదొక సువర్ల అధ్యాయమని , రైట్ టూ ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం, కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు అంటూ కొత్త నినాదాన్ని సీఎం జగన్ చెప్పారు. మన పోటీ అనేది ఈ దేశంలో ఉన్నవారితో కాదని, ప్రపంచంతోనని, మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని, మంచి జీతాలు పొందాలని, ఇది అంతా నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమైదని ఆయన సీఎం జగన్ తెలిపారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ…” ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం ప్రారంభం మాత్రమే. మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలలు వచ్చేసరికి కాస్తా టైమ్ పట్టవచ్చు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే కనీసం నాలుగైదేళ్లు పట్టవచ్చు. మనం వేసిన ప్రతి అడుగు ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అలానే ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాము. 6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ… ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. అలానే బైజూస్ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చాం” అని సీఎం జగన్ తెలిపారు. మరి.. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్ ఎక్స్ తో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసిన అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.