iDreamPost
android-app
ios-app

పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.35వేలు

  • Published Nov 06, 2023 | 9:55 AM Updated Updated Nov 06, 2023 | 9:55 AM

సొంత ఇంటి నిర్మాణం ప్రతి మనిషికి ఉండే అతి ముఖ్యమైన కల. దీన్ని నిజం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక.. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇక తాజాగా మరో నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. ఆ వివరాలు..

సొంత ఇంటి నిర్మాణం ప్రతి మనిషికి ఉండే అతి ముఖ్యమైన కల. దీన్ని నిజం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక.. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇక తాజాగా మరో నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. ఆ వివరాలు..

  • Published Nov 06, 2023 | 9:55 AMUpdated Nov 06, 2023 | 9:55 AM
పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.35వేలు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్‌ సర్కార్‌ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు మాత్రమే కాక.. అధికారంలోకి వచ్చాక మరిన్ని పథకాలను ప్రారంభించింది. అలానే సామాన్యుల కలలు సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడానికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక.. సొంతంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం అందజేస్తుండగా.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది జగన్‌ సర్కార్‌. ఆ వివరాలు..

ఏపీలో పేదలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 79 శాతం మంది లబ్ధిదారులకు పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది ఏపీ ప్రభుత్వం. అంతేకాక ఒక్కో ఇంటి నిర్మాణానికి సర్కార్‌ రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజా నిర్ణయంతో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అదనంగా రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది.

ఇదే కాక పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు జగన్‌ సర్కార్‌ ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తోంది. అంతేకాక ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని కూడా తక్కువ ధరకే అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి.

అంతేకాదు ఇళ్ల స్థలాలతో పాటు ఈ ఇళ్లను కూడా మహిళల పేరు మీదనే మంజూరు చేశారు. అందుకే పావలా వడ్డీ రుణాలు స్త్రీల పేరు మీదే విడుదల చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న సహకారం వల్ల తామంతా ఓ ఇంటివారము అవుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.