iDreamPost
android-app
ios-app

APలో వారికి శుభవార్త.. అకౌంట్లలో డబ్బులు జమ

  • Published Mar 31, 2024 | 4:35 PM Updated Updated Mar 31, 2024 | 4:35 PM

ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Mar 31, 2024 | 4:35 PMUpdated Mar 31, 2024 | 4:35 PM
APలో వారికి శుభవార్త.. అకౌంట్లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోంది. కేవలం పేదలు, బడుగు, బలహీన వర్గాల వారి గురించి మాత్రమే కాక రాష్ట్ర ప్రజలందరి మేలు కోసం ఆలోచిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్యులకే కాక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా స్పందిస్తూ.. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కొందరికి శుభవార్త చెప్పింది. వాకి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కార్. వారికి ఇవ్వాల్సిన ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. బకాయిపడిన నిధుల విడుదలకు సంబంధించి గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాక మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చింది. తాజాగా దాన్ని నెరవేర్చింది.

ఈ క్రమంలో మార్చి 31, అనగా ఆదివారం నాడు చెప్పిన ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో రూ.1600 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలను రెండు రోజులపాటు జమ చేసింది. ఈ క్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాక నెలరోజుల క్రితం ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి. కార్యాచరణను సైతం ప్రకటించాయి. పీఎఫ్, ఏపీజీఎల్‌వో లోన్లు, సరెండర్ లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ సహా పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ సైతం ప్రకటించాయి.

ఈ క్రమంలోనే ఛలో విజయవాడకు సైతం పిలుపునివ్వగా.. ప్రభుత్వం తరుఫున మంత్రులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లపై చర్చించారు. అనతరం పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ ఇవ్వటంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలను విరమించుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.