Dharani
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు అనగా మార్చి 1న వారి ఖాతాలో నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు అనగా మార్చి 1న వారి ఖాతాలో నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువు అని బలంగా నమ్ముతారు ముఖ్యమంత్రి జగన్. వారికి నాణ్యమైన విద్య అందిస్తే.. చాలు.. భవిష్యత్తు గురించి ఏ ఢోకా లేదని జగన్ అభిప్రాయం. అందుకే ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తయారు చేస్తున్నారు. అలానే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. ఇక పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకుడదనే ఉద్దేశంతో.. వారికి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన పథకాల కింద ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..
మార్చి నెల ప్రారంభంలోనే అనగా 1వ తారీఖునే వారి ఖాతాలో నగదు జమ చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. దీని ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనుంది. ఇంతకు ఏం పథకానికి సంబంధించి ఈ డబ్బులు విడుదల చేయనున్నారు అంటే.. జగనన్న విద్యాదీవెన స్కీమ్‌కు సంబంధించి. మార్చి 1న కృష్ణా జిల్లా పామర్రులో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. బటన్ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాలో విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు జగన్.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరకి ప్రభుత్వం ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పూర్తి డబ్బులను చెల్లిస్తోంది. ప్రతి ఏటా మూడు విడతల్లో ఈ డబ్బును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తోంది జగన్ సర్కార్. ఈమొత్తాన్ని తల్లిదండ్రులు నేరుగా వెళ్లి విద్యా సంస్థల్లో చెల్లించి అక్కడి పరిస్థితుల గురించి తెలసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఏటా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
ఈ పథకం కింద ఇంట్లో ఎంత మంది చదువుకుంటే.. అంత మందికీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లిస్తోంది. దీనిలో భాగంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించింది. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, మెడిసిన సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే వారికి రూ.20 వేల సాయం అందిస్తోంది జగన్ సర్కార్.