iDreamPost
android-app
ios-app

APలో వారికి గుడ్‌న్యూస్‌.. 4 రోజుల్లోనే ఖాతాలో రూ.5868 కోట్లు జమ

  • Published May 19, 2024 | 11:52 AM Updated Updated May 19, 2024 | 11:52 AM

AP Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నిధుల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ముగియడంతో ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఆవివరాలు..

AP Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నిధుల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ముగియడంతో ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఆవివరాలు..

  • Published May 19, 2024 | 11:52 AMUpdated May 19, 2024 | 11:52 AM
APలో వారికి గుడ్‌న్యూస్‌.. 4 రోజుల్లోనే ఖాతాలో రూ.5868 కోట్లు జమ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. ఏపీలో పలు పథకాల అమలు నిలిచిపోయింది. లబ్దిదారుల ఖాతాలో నిధులు జమ కాలేదు. అలానే పెన్షన్ల పంపిణీకి కూడా ఆటంకం ఏర్పడింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడంతో.. వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఎన్నికలు ముగియడంతో.. ఇప్పుడు పథకాల నిధుల విడుదలకు ఆమోదం లభించింది. నిధులు మంజూరు చేశారు. దాంతో పోలింగ్‌ ముగిసిన 4 రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలో రూ.5,868 కోట్లను జమ చేసింది ప్రభుత్వం.

ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. వైఎస్సార్‌ ఆసరా పథకం, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన నిధులు విడుదల చేసింది సర్కార్‌. ఈ పథకాల కింద సుమారు ఈ రూ.5868 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ. 1843 కోట్లు జమ చేశారు. అలానే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద అన్నదాతల ఖాతాల్లోకి రూ. 1236 కోట్లు వేశారు. మరోవైపు.. వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదల ఖాతాలో రూ.629 కోట్లు జమ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకంలో భాగంగా రూ.605 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.

ఈ పథకాల నిధులు ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈలోపే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఈ పథకాలకు సంబంధించిన నగదు విడుదల ఇన్ని రోజులు ఆగిపోయింది. అయితే పోలింగ్ పూర్తి కావడంతో తిరిగి సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్‌ పూర్తి కాగానే.. లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తానని.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కోడ్ పూర్తి కాగానే డబ్బులు చెల్లింపులు చేశారు. ఖాతాలో నగదు జమ కావడంతో.. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల పిన్షన్ల పంపిణీ కూడా వాలంటీర్లే చేస్తారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.