AP ప్రజలకు బిగ్‌ అలర్డ్‌.. ఆ పథకాల నగదు విడుదల ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. ఎన్నికల కోడ్‌ కారణంగా ఆగిపోయిన పలు సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరి ఆ డబ్బులు అకౌంట్‌లో పడేది ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. ఎన్నికల కోడ్‌ కారణంగా ఆగిపోయిన పలు సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరి ఆ డబ్బులు అకౌంట్‌లో పడేది ఎప్పుడంటే..

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమ కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. బడుగు, బలహీన వర్గాలు వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ఙకంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం ముందుకెళ్తుందని భావించిన సీఎం జగన్‌.. ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ.. వారి మన్ననలు అందుకుంటున్నారు. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో కొన్ని పథకాలకు సంబంధించని నిధులు విడుదల చేశారు. ఆ వివరాలు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత, విద్యాదీవెన, ఆసర, ఈబీసీ నేస్తం వంటి పథకాలు తీసుకువచ్చారు. ప్రతి ఏటా టైమ్‌ ప్రకారం ఆయా పథకాల నిధులును విడుదల చేస్తుంటారు. అయితే ఏప్రిల్‌ నుంచి ఈ పథకాల అమలుకు బ్రేకులు పడ్డాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. సదరు పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదు. పోలింగ్‌ ముగిసిన వెంటనే వీటిని విడుదల చేయవచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో తాజాగా ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఎన్నికలు ముగియడంతో.. ఇప్పుడు నిధులు విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఎస్సార్‌ చేయూత, విద్యాదీవెన, ఆసర, ఈబీసీ నేస్తం పథకాల నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంటే మరో నాలుగు రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి అన్నమాట. ఇక ఎన్నికల కోడ్‌ కారణంగా ఈసీ వాలంటీర్ల ద్వారా పెన్షన్‌ పంపిణీ ఆపేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వృద్ధులు, వికలాంగులు గత రెండు నెలల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పెన్షన్‌ కోసం వెళ్లి.. ఎండలకు తాళలేక.. కొందరు వృద్ధులు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ నెల అనగా జూన్‌లో మాత్రం వాలంటీర్ల ద్వారా పెన్షన్‌ పంపిణీ ఉండనుంది అని తెలుస్తోంది.

Show comments