iDreamPost
android-app
ios-app

APలో పేదలకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు!

  • Published Feb 15, 2024 | 10:28 AM Updated Updated Feb 15, 2024 | 10:28 AM

ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జనగ్‌మోహన్‌రెడ్డి. దీని ద్వారా పేదలకు ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు లబ్ధి చేకూరనుంది. ఆ వివరాలు..

ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జనగ్‌మోహన్‌రెడ్డి. దీని ద్వారా పేదలకు ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు లబ్ధి చేకూరనుంది. ఆ వివరాలు..

  • Published Feb 15, 2024 | 10:28 AMUpdated Feb 15, 2024 | 10:28 AM
APలో పేదలకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు!

ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది సీఎం జగన్‌ కల. దాన్ని సాకారం చేయడం కోసం ఆయన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అంతేకాక వారు ఆ జాగాలో ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఏపీ ప్రభుత్వం వారికి లక్షల్లో ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జగన్‌ సర్కార్‌ పేదలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం.. త్వరలోనే మరికొందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఆవివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లోనే మరో 2,32,686 ఇళ్లు నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదానలు పంపినట్లు.. ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె.వెంకట రమణారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఆ లేఅవుట్‌లలో నీరు, విద్యుత్‌ సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Good news for the poor in AP

ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, శరవేగంగా ఆ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వీటిలో 19.13 లక్షలు సాధారణ ఇళ్లు కాగా, మిగిలినవి టిడ్కో ఇళ్లు. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 4.15 లక్షల ఇళ్ల నిర్మాణం.. పునాది నుంచి రూఫ్‌ లెవల్‌ వరకు వివిధ దశల్లో ఉన్నాయి.

ప్రతి పేదవాడికి రూ.2.70 లక్షల మేలు

జగన్‌ సర్కార్‌.. పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అక్కడితో ఆగకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15వేలు, సిమెంట్, స్టీలు, మెటల్‌ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.

అంతేకాదు పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంకు నుంచి రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు ప్రభుత్వం నుంచి రూ.2.70 లక్షలు చొప్పున మేలు కలుగుతోంది. దీనికి అదనంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో రూ.లక్షకు పైగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.