Dharani
AP Govt: ఏపీలోని వాహనదారులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇక మీదట ఆ డాక్యుమెంట్స్ లేకుండా వాహనదారులు రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఆ వివరాలు..
AP Govt: ఏపీలోని వాహనదారులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇక మీదట ఆ డాక్యుమెంట్స్ లేకుండా వాహనదారులు రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఆ వివరాలు..
Dharani
జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. వారికి భారీగా జరిమానా విధించడమే కాక.. జైలు శిక్ష కూడా పంసిస్తామని ఆర్టీఓ అధికారులు తెలిపారు. ఇక మైనర్లకు బండ్లు ఇస్తే.. 25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలానే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు. ఇక ఈ రూల్స్ దేశవ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఆ పత్రాలు లేకుండా.. రోడ్ల మీదకు వస్తే.. జరిమానా విధించడంతో పాటు.. జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించింది. ఇంతకు ఆ పత్రాలు ఏవంటే..
ఏపీలోని వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై థర్ఢ్ పార్టీ బీమా లేకుండా నడిపే వాహనాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించింది. ఇందుకోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని.. ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బీమా పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేయాలని సూచించింది. ఈమేరకు ఏపీ రవాణా శాఖ కమిషనర్.. మనీష్ కుమార్ సిన్హా.. ఆదేశాలు జారీ చేశారు. బీమా పత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఏప్రిల్ 2న కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రహదారి భద్రతలో భాగంగా.. వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండేలా చూడాలని ఆదేశించింది. ఈమేరకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రధానంగా థర్డ్ పార్టీ బీమా లేని వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే.. అలాంటి ఘటనల్లో.. చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎలాంటి బీమా సాయం అందటం లేదు. ఈక్రమంలోనే కేంద్రం.. వాహనాలకు కచ్చితంగా బీమా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 3న మెమో జారీ చేసింది. వాహనాల బీమాకు సంబంధించి తరచుగా మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ తరచుగా తనిఖీలు చేయాలంటూ.. తాజాగా ఆర్‌జేటీసీలు, డీటీఓలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. బీమా లేకుండా పట్టుబడే వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశాల్లో ప్రస్తావించారు. అంతేకాక బీమా లేకుండా పట్టుబడిన వాహనదారుడిపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీని ప్రకారం.. ఇకపై బీమా లేకుండా తొలిసారి పట్టుబడే వాహనదారుడికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 2 వేల రూపాయల జరిమానా విధిస్తారు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష, జరిమానా రెండు విధించే అవకాశం ఉంది. ఒకవేళ మళ్లీ దొరికిపోతే.. మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా.. 4 వేల రూపాయలు ఫైన్ విధిస్తారు. అలానే కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది.