iDreamPost
android-app
ios-app

APలో ఆశాఖ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు!

  • Published Feb 21, 2024 | 9:50 AM Updated Updated Feb 21, 2024 | 9:55 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి జీతాలు భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి జీతాలు భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Feb 21, 2024 | 9:50 AMUpdated Feb 21, 2024 | 9:55 AM
APలో ఆశాఖ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులకు మాత్రమే కాక.. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ సిబ్బంది విషయంలో జగన్‌ తీసుకునే నిర్ణయాలు చూస్తే.. వారికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ శాఖ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి జీతాలు భారీగా పెంచుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఒక్కో ఉద్యోగి నెల జీతం రూ. 6 వేలకు పైగా పెరగనుంది. ఆ వివరాలు..

సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి జీతాలు 23 శాతం పెంచుతూ సమగ్రశిక్ష శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జీతం పెరగని వారికి మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా సెక్షన్‌ ఆఫీసర్లు, సిస్టమ్‌ ఎనలిస్టులు, సైట్‌ ఇంజనీర్లు (బీటెక్‌), సైట్‌ ఇంజనీర్లు (డిప్లొమా), మెసెంజర్స్‌, ఐఈఆర్‌టీలు, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు, డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్లు, డ్రైవర్లకు జీతం పెంచుతున్నట్లు సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ అధికారులు వెల్లడించారు.

23 శాతం పెంపు అంటే ఎంత పెరగనుంది అంటే.. ఉదాహరణకు ప్రస్తుతం సెక్షన్‌ ఆఫీసర్‌ జీతం రూ.28,940 ఉందని అనుకుందాం. ఇక తాజా పెంపుతో అది రూ.35,596 అవుతుందన్నారు. అతి తక్కువ జీతాలున్న డ్రైవర్లకు కూడా ఇకపై రూ.24,600 వస్తుందని అధికారులు వెల్లడించారు. . సమగ్రశిక్ష ఉద్యోగులు తమకు జీతాలు పెంచాలంటూ దాదాపు నెల రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా జీతాలు పెంచని వారికి 23 శాతం పెంచుతామని అప్పట్లో విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. తాజాగా దాని అమలుకు ఆదేశాలు జారీ చేశారు.

తాము అధికారంలోకి వస్తే సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచుతామంటూ ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్షలో పనిచేస్తూ.. 2019 నుంచి జీతాల పెంపు పొందని ఉద్యోగులందరికీ గౌరవ వేతనాలు పెంచింది. దీనిపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.