Geetanjali: గీతాంజలి బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ !

సోషల్‌ మీడియా వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్‌. ఆవివరాలు..

సోషల్‌ మీడియా వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్‌. ఆవివరాలు..

ప్రజలందరిని తన కుటుంబంగా భావిస్తూ.. వారికి సంక్షేమ పాలన అందిస్తూ.. అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో సుమారు 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది అనేది వాస్తవం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్లు చాపిన ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ఏపీ ప్రజలు జగన్‌ను తమ బిడ్డలా, అన్నలా భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కూడా ఇలానే అనుకుంది. జగనన్న తనకు చేసిన మేలు గురించి ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది. అదుగో అదే పచ్చ బ్యాచ్‌కు నచ్చలేదు. సోషల్‌ మీడియా వేదికగా ఎంతో దారుణంగా గీతాంజలిని ట్రోల్‌ చేశారు. ఆ వేధింపులు తాళలేక.. పాపం ఆ అభాగ్యురాలు కన్న బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఆమె బిడ్డలను ఆదుకుంటామని ప్రకటించడమే కాక 20 లక్షల రూపాయల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ఇక రోజుల వ్యవధిలోనే ఈ మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్‌. ప్రకటించినట్లుగానే గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు.

ఈ సందర్భంగా శివ కుమార్‌ మాట్లాడుతూ.. తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతికకాయానికి నేడు తానే పూలమాల వేయాల్సి రావటం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ తనను ఎంతో బాధపెట్టింది అన్నారు. అమాయక మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని తెలిపారు.

ఎన్నారై రూ.2 లక్షల సాయం

టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్‌ ప్రభాకర్‌ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆ తర్వాత ఆయన వీడియో కాల్‌ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. గీతాంజలి మృతి తీరని లోటని.. కానీ ఆమె పిలలిద్దరిని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నా.. అందుకు అయ్యే ఖర్చులను తన మిత్ర బృందంతో కలిసి తామే భరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వేధింపులు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం అందించిన పంచ్‌ ప్రభాకర్‌కు గీతాంజలి భర్త బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు.

Show comments