P Venkatesh
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు రైలు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలోనే చెక్కులు అందించింది జగన్ సర్కార్.
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు రైలు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలోనే చెక్కులు అందించింది జగన్ సర్కార్.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రైలు ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రైలు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణను ఘటనా స్థలికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. కాగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు రైలు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలోనే చెక్కులు అందించింది జగన్ సర్కార్.
కాగా సీఎం జగన్ రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధితులు అదైర్యపడొద్దని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సీఎం ఆదేశాలతో విజయనగరం ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు నష్టపరిహారం చెక్‌లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు అందజేశారు.
10 మందికి రూ.5 లక్షలు, ముగ్గురుకి రూ.10లక్షలు, మిగతావారికి రూ.2 లక్షలు చొప్పున.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలను ఏపీ ప్రభుత్వం అందజేసింది. 13 మంది మృతులకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ.2 కోట్ల 62 లక్షలు అందచేశారు. కాగా బాధితుల్లో పేద వాళ్లు ఉండడంతో అంగవైకల్యం చెందిన వారికి రూ. 10 లక్షలు, కొన్నాళ్లపాటు మంచానికి పరిమితమయ్యే వారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం పెంచారు సీఎం జగన్. పెంచిన పరిహారాన్ని బాధితులకు అందజేశారు అధికారులు.
కాగా విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్టణం నుండి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే అదే సమయంలో ఈ రైలు వెనుకే వస్తున్న విశాఖపట్టణం-రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఆ తరువాత పక్క ట్రాక్ లో ఉన్న గూడ్స్ పైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.