iDreamPost
android-app
ios-app

APలో రేషన్‌ కార్డ్‌ ఉన్న వారికి గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరకే అవన్నీ.. వచ్చే నెల నుంచే

  • Published Feb 22, 2024 | 8:36 AM Updated Updated Feb 22, 2024 | 8:36 AM

రేషన్‌ కార్డు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పీడీఎస్‌ ద్వారా నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందిస్తోన్న సర్కార్‌.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు

రేషన్‌ కార్డు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పీడీఎస్‌ ద్వారా నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందిస్తోన్న సర్కార్‌.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు

  • Published Feb 22, 2024 | 8:36 AMUpdated Feb 22, 2024 | 8:36 AM
APలో రేషన్‌ కార్డ్‌ ఉన్న వారికి గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరకే అవన్నీ.. వచ్చే నెల నుంచే

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్‌ సర్కార్‌ ప్రజా సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. అలానే రేషన్‌కార్డు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జగన్‌ సర్కార్‌ ఏపీలో రేషన్‌ కార్డ్‌ ఉన్న వారికి శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను ఇస్తోన్న ప్రభుత్వం వాటి జాబితాలో మరి కొన్నింటిని చేర్చింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. ఆ వివరాలు..

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి రేషన్‌కార్డు ఉన్న వారికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగి పిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది నిర్ణయించింది ప్రభుత్వం. మార్చి 1 నుంచి రాగి పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో అందివ్వనున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రాగిపిండి కిలో ధర రూ.40పైనే పలుకుతుండగా.. ప్రభుత్వం మాత్రం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది.

Good news for ration card holders in AP

అయితే రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో పంపిణీ చేయనున్నారు. అలానే రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోను రాగి పిండి పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో ఒక్కో రేషన్‌ కార్డు మీద ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందిస్తోంది ప్రభుత్వం. రేషన్‌కార్డుదారులు వాటిని మిల్లింగ్‌ చేసుకుని వినియోగించుకుంటున్నారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. నేరుగా రాగిపిండినే పంపిణీ చేయనున్నారు.

రేషన్‌ కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే కాక.. స్థానిక రైతులకు సాయం చేయడం కోసం పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలానే చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచడానికి ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాక పీడీఎస్‌లో పౌష్టికాహారం అందించేందుకు నాణ్యమైన ఫోర్టిఫైడ్‌ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నారు.

ఇక ఏపీలో పీడీఎస్‌లో అందిస్తున్న ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండికి మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి నెలా 2,500 టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు వినియోగం ఉంటోంది. ఇదే గోధుమ పిండిని కేంద్రం భారత్‌ బ్రాండ్‌ పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తున్నారు. మార్కెట్‌ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమపిండి పంపిణీ చేస్తుడటంతో దీనికి భారీగా డిమాండ్‌ ఉంటుంది.