సెప్టెంబర్ 28న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కారణమిదే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెప్టెంబర్‌ 28 అనగా గురువారం సెలవు ప్రకటించింది. ఎందుకు అంటే.. మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ప్రభుత్వం గురువారం నాడు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు డిక్లేర్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొహమ్మద్‌ ప్రవక్త జన్మదినం(మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ)ను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఇటు హైదరాబాద్‌లో మిలాద్ ఉన్ నబీతో పాటుగా వినాయక నిమజ్జనం రెండు ఒకే రోజు వచ్చాయి. దీంతో ముస్లిం మత పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా మిలాదున్ నబి ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు పాతబస్తీ మత పెద్దలు సౌత్ జోన్ డీసీపీతో మాట్లాడిన తర్వాత ప్రకటించారు. ప్రవక్త మహమ్మద్‌ను విశ్వ శాంతి కోసం అల్లాహ్ నియమించారని.. అందుకే ఆ రోజున.. ఆయనను స్మరించుకుంటూ ఈద్-ఎ మిలాద్-ఉన్-నబీ పండుగను జరుపుకుంటారు ముస్లిం సోదరులు. ఇటు తెలంగాణలో కూడా సెప్టెంబర్‌ 28న సెలవు దినంగా ప్రకటించారు.

Show comments