Arjun Suravaram
ఏపీలో ఎండలు అదరగొడుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలకు వణికిపోతున్నారు. ఇలా ఎండలు దండికొడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం దృష్ణ్యా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఎండలు అదరగొడుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలకు వణికిపోతున్నారు. ఇలా ఎండలు దండికొడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం దృష్ణ్యా కీలక నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భయటకి రావడానికి ప్రజలు భయంతో వణికి పోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక వృద్ధులు,పిల్లలు అయితే ఎండవేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇలా ఎండలు దంచికొడుతున్న దృష్ట్యా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో పిల్లలు డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఏపీలో ఎండలు అదరగొడుతున్నాయి. అధిక వేడిగాలులకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇవి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆ తరువాత వేసవి సెలవులు ప్రారంభమై.. జూన్11వరకు కొనసాగుతాయి. ఇలా ఒంటి పూట బడులు కొనసాగుతున్నా కూడా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వండదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ విద్యాశాఖ. రోజు రోజూకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని ప్రభుత్వు పాఠశాలల్లో వాటర్ బెల్స్ ను మోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు రోజులో మూడు సార్లు బడి గంటను మోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రోజూ ఉదయం 8.45, 10.50, 11.50 గంటలకు మూడు సార్లు బెల్ కొట్టాలని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కమిషనర్ ఆదేశించారు. ఈ మూడు సార్లు బెల్స్ మోగినప్పుడు ఐదు నిమిషాల చొప్పున మంచి నీరు తాగేందుకు విద్యార్థులకు విరామం ఇవ్వనున్నారు. లంచ్ బ్రేక్ మాదిరిగా ఇక ఏపీ పాఠశాలల్లో వాటర్ బ్రేక్స్ కూడా ఇవ్వనున్నారు. విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండేదు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తాసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
మరోవైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఏపీలోని 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో వైద్యులు సైతం పలు సూచనలు చేస్తున్నారు. నీరు ఎక్కువగా తీసుకుంటూ నీటి శాతం ఉన్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా విద్యార్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.