P Krishna
ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చారు. ఏపీ ప్రజలు తనను నమ్మ రాష్ట్ర బాధ్యత తనకు అప్పగించినందుకు అన్ని విధాలుగా అభివృద్ది చేసి చూపిస్తానని పలు సందర్భాల్లో అన్నారు.. మాట నిలబెట్టుకుంటున్నారు.
ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చారు. ఏపీ ప్రజలు తనను నమ్మ రాష్ట్ర బాధ్యత తనకు అప్పగించినందుకు అన్ని విధాలుగా అభివృద్ది చేసి చూపిస్తానని పలు సందర్భాల్లో అన్నారు.. మాట నిలబెట్టుకుంటున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. పాదయాత్ర సందర్భంగా పేదలకు ఇచ్చిన మాటల నిలబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ, విద్య, వైద్య, మహిళా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. వారి అభివృద్దికి బాట వేస్తున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికల రాబోతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎజెండాలతో ప్రజల్లోకి వెళ్తుతున్నారు. నిరుపేదలకు సొంత ఇళ్లు ఒక కల.. ఏపీ సీఎం వారి కలలను సాకారం చేస్తున్నారు. తాజాగా ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పేద ప్రజలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాకు రిజిస్ట్రేషన్ చేయాలని భూ పరిపాలన శాఖ ఆదేశించింది. ఈ కార్యక్రమం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు కొనసాగనుంది. జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ సారథ్యంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సమీక్షించాలని సూచించారు. అంతేకాదు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీఆర్‌ఓ సంబంధిత సచివాలయంలో ప్రత్యక్షంగా విధుల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సర్వే, ఫ్లాట్ నెంబర్లు, పేర్లు, ఇతర వివరాల నమోదు బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరపాలని.. ఈ విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ముఖ్యమంత్రి సందేశంలో ముద్రించే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మంచి క్వాలీటీగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
ఈ నెల 27 నుంచయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరుపు నుంచి వీఆర్‌ఓ పేద ప్రజలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు ఉండకూడదని, జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను దర్శించి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లబ్దిదారులకు వెంటనే కన్వేయన్స్ డీడ్ లను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ తేదీల్లో వీఆర్‌వోలు సచివాలయంలోనే ఉండేలా చూడాల్సిన బాధ్యతలు తహశీల్దార్లకు ఇచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.