ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం అనే పథకాలు ప్రవేశపెట్టారు. అలానే రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు వివిధ రూపాల్లో ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నారు. అలానే ప్రజలకు అందించే నిత్యవసర సరకుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడటం లేదు. రేషన్ కార్డు దారులకు తరచూ ఏపీ ప్రభుత్వం శుభవార్త చెబుతుంది. తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు గుడ్ న్యూస్ చెప్పారు.

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. బియ్యం కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను అందించేందుకు సిద్ధమైంది. ఆగష్టు నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరారవు తెలిపారు.  అలానే రేషన్ డీలర్ల కోసం గ్రామాల్లో గోదాములు, దుకాణాలు నిర్మిస్తామని, సీఎంతో మాట్లాడి రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. డీలర్లకు ఆరోగ్యశ్రీ, ఎల్ఓసీ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. గతంలో రాయలసీమ జిల్లాల్లో రాగులు పంపిణీ చేశారు. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కెరతోపాటుగా రాగులను కూడా పంపిణీ చేశారు. మరి.. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పిన ఈ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ పై కేసు.. విచారణ రేపటికి వాయిదా!

Show comments