Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండగ సెలవును ప్రభుత్వం మార్చింది. ఈ నెల 12వ తేదీకి బదులు మరో తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ను విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండగ సెలవును ప్రభుత్వం మార్చింది. ఈ నెల 12వ తేదీకి బదులు మరో తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ను విడుదల చేశారు
Arjun Suravaram
దేశ ప్రజలందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళీ ఒకటి ఈ పండగను పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఏటా దీపావళి నవంబర్ నెలలో వస్తుంది. ఈ సారి కూడా అదే మాదిరి నవంబర్ నెలలో వచ్చింది. అయితే నవంబర్ 12వ తేదీని దీపావళి పండగ జరుపుకోనున్నారు. ఆరోజు ఆదివారం కావడంతో ప్రత్యేకంగా హాలిడే అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో దీపావళి సెలవు తేదీని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పండగ తేదీ మార్పులను ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సెలవు తేదీని జగన్ సర్కార్ మార్చింది. ఈ నెల 13వ తేదీ, సోమవారంను దీపావళి సెలవు ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో నవంబర్ 12 తేదీ ఆదివారం దీపావళిగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్పల్ప మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 13వ తేదీ, సోమవారం ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 13న ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు రానున్నాయి.
ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 11వ తేదీన రెండో శనివారం, 12న ఆదివారం కాగా, తాజాగా ప్రభుత్వం 13వ తేదీన సెలవు ప్రకటించడంతో.. ఒకేసారి పండగకు మూడు రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లేందుకు కూడా చాలా మంది సిద్ధమైనట్లు సమాచారం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ ఈ దీపావళి. అందుకే అందరూ ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు