కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించింది అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సాకే భారతి. కటిక పేదరికం ఎదుర్కొంటూనే పీహెచ్ డీ పూర్తి చేసి అందరి మన్ననలు పోందుతోంది భారతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆమె ప్రతిభను ప్రశంసించారు. డాక్టర్ సాకే భారతి ప్రతిభకు బహుమతిని ప్రకటించింది జగన్ సర్కార్. ఆమెకు రెండెకరాల స్థలంతో పాటుగా జూనియర్ లెక్చరర్ పోస్ట్ ను సైతం కేటాయించింది. ఇందుకు సంబంధించి ఏపీ సర్కార్ ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
డాక్టర్ సాకే భారతి.. ఇప్పుడు ఈ పేరు విద్యారంగంలో ఓ ట్రెండ్ సెట్టర్. కూలీ పనులు చేస్తూనే శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేసింది సాకే భారతి. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన చదువును మాత్రం విడిచిపెట్టలేదు భారతి. ఇక పీహెచ్ డీ పూర్తి చేసిన సాకే భారతికి ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. ఈ మేరకు ఆమెకు రెండు ఎకరాల స్థలంతో పాటుగా జూనియర్ లెక్చరర్ పోస్ట్ ను మంజూరు చేస్తూ.. జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భూమికి సంబంధించిన పట్టాను అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి సాకే భారతికి అందజేశారు.
ఈ సందర్భంగా భారతిని ప్రశంసిచారు జిల్లా కలెక్టర్. ఎన్నో కష్టాలను అధిగమించి సాకే భారతి పీహెచ్ డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమని, యువతకు ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ గౌతమి ప్రశంసిచారు. కాగా.. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్ట్ కు ఆమె అంగీకరిస్తే.. నామినేట్ చేస్తామని వెల్లడించారు. మరి మట్టిలో పుట్టిన మాణిక్యం అయిన సాకే భారతికి జగన్ సర్కార్ అండగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: VRAలకు జగన్ సర్కార్ శుభవార్త.. త్వరలోనే ఉత్తర్వులు!