iDreamPost
android-app
ios-app

నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర చేస్తున్నారు: పోసాని

నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర చేస్తున్నారు: పోసాని

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై పరువు నష్ట దావావ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై పరువు నష్టం దావా వేయడంపై పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అక్రమాలను బయటపెట్టినందకే తనపై కక్ష పెంచుకున్నారని ఆయన చంద్రబాబు, లోకేశ్ లపై విరుచకపడ్డారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన లోకేశ్ పై సంచలన ఆరోపణలు చేశారు. లోకేశ్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని పోసాని ఫైర్ అయ్యారు.

సచివాలయంలో పోసాని మాట్లాడుతూ..” లోకేశ్ నాపై రూ.4 కోట్లకు పరువు నష్టదావా వేశారు. లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా?. సీఎం జగన్ పై ఇష్టమెచ్చినట్లు మాట్లాడిన లోకేశ్ పై పరువు నష్టం దావా వేయకూడాదా?. నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర  చేస్తున్నారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో నన్ను చంపేందుకు లోకేశ్ పథకం రచిస్తున్నారు. నేను చనిపోతే.. అందుకు లోకేశ్  దే బాధ్యత. కంతేరులో భూమి కొన్నాడు అనడం పరువు నష్టం అయిందట. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది నిజం కాదా? నేను కూడా కేసు పెడతాను నిజం కావాలా?. సాక్ష్యం కావాలా?. లోకేశ్ కంటే క్రెడిబులిటీ ఉన్న వాడిని. జగన్ వ్యక్తిత్విం నచ్చే.. ఆయన వెంట ఉన్నాను. లోకేశ్ పీఏ చైతన్య నాకు ఫోన్ చేసి.. టీడీపీలోకి రావాలని  చెప్పాడు.

లోకేశ్ అమ్మ, భార్య ఆస్తులు లోకేశ్ వి కావా?. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే నాపై కక్ష గట్టారు.  నాపై పాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు  చేస్తున్నారు. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి  నన్ను తిట్టిస్తున్నారు.  గెలిచింది  ఏ కులం వారైనా ప్రజలకు మంచి చేస్తున్నారా? లేదా? అనేది చూడాలి.   ఏ వ్యవస్థనైనాా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు. అందుకే అన్ని కేసులు ఉన్నా జైలుకు వెళ్లలేదు. పుంగనూరులో  ఏకంగా పోలీసులపై కూడా హత్యా యత్నం చేశారు. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నా జీవితాంతం వైఎస్ జగన్ వెంట ఉంటాను. చావుకు భయపడని వ్యక్తిని” అంటూ పోసాని లోకేశ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మరి..లోకేశ్ పై పోసాని చేసిన సంచలన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet