Dharani
ఏపీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో తాజాగా హిందూపూర్ బరిలో నిలిచిన ఓ స్వామిజీ.. నియోజకవర్గ ఓటర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ఆ వివరాలు..
ఏపీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో తాజాగా హిందూపూర్ బరిలో నిలిచిన ఓ స్వామిజీ.. నియోజకవర్గ ఓటర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ఆ వివరాలు..
Dharani
ఎన్నికల వేళ నేతలు అలవికాని హామీలు ఇస్తూ.. ప్రజలను మభ్య పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అర చేతిలోనే వైకుంఠం చూపించి.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. బడా బడా రాజకీయ పార్టీలు మాత్రమే కాక స్వతంత్రంగా బరిలో నిలిబడే అభ్యర్థులు సైతం ఇలా ఓటర్ల మీద హామీల వర్షం కురిపిస్తారు. ఇక కొన్ని చోట్ల అభ్యర్థులే తమ కోసం వ్యక్తిగతంగా ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ స్వామిజీ ఇచ్చిన హామీ.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుస్తాను అంటున్నారు సదరు స్వామిజీ. ఆ వివరాలు..
పరిపూర్ణానంద స్వామీజీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆధ్యాత్మిక గురువుగా, శ్రీపీఠం వ్యవస్థాపకులుగా.. జనాలకు ఆయన తెలుసు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే పరిపూర్ణానంద స్వామి.. తొలిసారి 2018 తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఇక ఈ ఏడాది అనగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. హిందూపురం నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ బరిలో నిలిచారు. ఎంపీ సీటు సైతం టీడీపీ నేత బీకే పార్థసారథికి దక్కింది. దీంతో అసంతృప్తికి గురైన పరిపూర్ణానంద స్వామి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.
ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పరిపూర్ణానంద స్వామీజీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పరిపూర్ణానంద స్వామీజీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో హిందు అనే పేరుతో ఉన్న నగరం ఇదేనని.. అందుకే ఇక్కడే బరిలోకి దిగుతానంటూ పట్టుబట్టి పోటీలో నిలిచాను అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం.. హిందూపురం ఓటర్లపై హామీలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే పరిపూర్ణానంద స్వామి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి, తనను గెలిపిస్తే ప్రతి ఇంటికీ లక్ష రూపాయల లబ్ధిని కలిగిస్తామని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వ్యక్తిగతంగా తాను ఇచ్చిన హామీలతో పాటుగా ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.