AP Elections 2024: ఓటేసిన CM జగన్‌.. పోలింగ్‌ వేళ ట్వీట్‌ వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు ఓటేసేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు ఓటేసేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్‌ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు అనగా సోమవారం ఉదయం నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 459 వాహనాల్లో పోలింగ్ మెటీరియల్‌ను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. ఇక పోలింగ్‌కు ముందు వరుసగా సెలవులు రావడంతో.. ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఓటు వేయడం కోసం జనాలు సొంత ఊర్లకు పయనం అయ్యారు.

నేడు పోలింగ్‌ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 138వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు వేశారు. పోలింగ్‌ వేళ ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌ అభ్యర్థించారు. ‘‘నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, యువతీయువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ.. కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

ఇక ఈవీఎంలు మోరాయించడంతో పలు చోట్ల పోలింగ్‌ ఆలస్యం అయ్యింది. ఇక ఏపీలో ఉదయం 7-9 గంటల వరకు 9.05శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Show comments